2 May, 2026 | 1:21 PM

వనపర్తిలో నేటి నుంచి సెపక్తక్రా పోటీలు

20-09-2025 12:27 PM

ఏర్పాట్లను పరిశీలిస్తున్న జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ 

వనపర్తి టౌన్: ఈనెల 21 నుంచి 22 వరకు వనపర్తి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల(Wanaparthy government polytechnic college) మైదానంలో ఉదయం 11 గంటలకు నిర్వహిస్తున్న 11వ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఛాంపియన్షిప్ సెపక్తక్రా టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి జిల్లా సెపక్తక్రా అసోసియేషన్ అధ్యక్షులు బండారు శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. శనివారం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో నిర్వహించే క్రీడలకు సంబంధించిన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ క్రీడా పోటీల్లో తెలంగాణ రాష్ట్రంలోని గతంలో ఉన్న పది జిల్లాల పరిధిలో మొత్తం 20 టీములు ఈ పోటీల్లో పాల్గొంటారని 10 టీములు మహిళలు 10 టీంలు పురుష క్రీడాకారులు సెపక్తక్రా టోర్నమెంటులో పాల్గొంటారని ఆయన తెలిపారు.

ఈ క్రీడా పోటీలను రాష్ట్ర పశుసంవర్ధక క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘా రెడ్డి,రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, రాష్ట్ర స్పోర్ట్స్ చైర్మన్ శివసేనారెడ్డి తదితరులు హాజరవుతున్నారని ఈ పోటీలను తిలకించేందుకు జిల్లాలోని క్రీడాకారులతో పాటు క్రీడాభిమానులు ప్రజలు భారీ ఎత్తున తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ క్రీడా పోటీల ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ తో పాటు రిటైర్డ్ ఫిజికల్ డైరెక్టర్ భాస్కర్ గౌడ్. భాస్కర్ రెడ్డి. గట్టు వెంకన్న. ఉప్పల భాస్కర్. జగదీశ్ రెడ్డి. తదితరులు ఉన్నారు.