calender_icon.png 20 September, 2025 | 2:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజాస్వామ్యంలో ఎన్ని పార్టీలు ఉంటే అంత మంచిది

20-09-2025 11:59:33 AM

హైదరాబాద్: ఆల్మట్టి ఎత్తు పెంచితే కృష్ణాలో క్రికెట్ ఆడుకోవడం తప్ప ఏమీ ఉండదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) శనివారం నాడు మీడియా సమావేశం నిర్వహించారు. సుప్రీంకోర్టు స్టే ఉన్నప్పటికీ ఆల్మట్టి ఆనకట్ట ఎత్తు పెంచేందుకు కర్నాటక ప్రభుత్వం సిద్ధమైందన్నారు. అల్మట్టి డ్యాంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే సుప్రీంకోర్టుకు వెళ్లాలని కోరారు. ప్రభుత్వం వెళ్లకుంటే జాగృతి తరుఫున సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని కవిత సూచించారు. మహారాష్ట్ర ఇప్పటికే స్పందించి కోర్టును ఆశ్రయిస్తామని ప్రకటించిందని ఆమె తెలిపారు. అల్మట్టి ఎత్తు పెంచితే కృష్ణాలో క్రికెట్ ఆడుకోవడం తప్ప ఏమీ ఉండదని ఎద్దేవా చేశారు. పదేళ్లలో ఆర్టీఎస్, తుమ్మిళ్ల, పాలమూరు-రంగారెడ్డి పూర్తి చేసుకోలేకపోయామని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి కూడా కృష్ణా ట్రైబ్యునల్ విచారణకు వెళ్లాలని కోరారు. 

బీఆర్ఎస్ పార్టీ తరఫున హరీశ్ రావు, సంతోష్ సోషల్ మీడియా(Social media) నాపైనే దాడి చేస్తున్నాయని కవిత ఆరోపించారు. సోషల్ మీడియాలో నాపై దాడిని ప్రజలు గమనిస్తున్నారని ఆమె వెల్లడించారు. బీసీ రిజర్వేషన్లపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే నిరసనలు తెలుపుతామన్నారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశా.. ఆమోదించాలని ఛైర్మన్ ను కోరినట్లు కవిత స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో ఎన్ని పార్టీలు ఉంటే అంత మంచిదని కవిత అభిప్రాయపడ్డారు. ప్రజాస్వామ్యంలోకి కొత్త పార్టీలు వస్తే స్వాగతిస్తామని సూచించారు. రేపు చింతమడకలో జరిగే బతుకమ్మ వేడుకల్లో పాల్గొంటానని కవిత వివరించారు.