02-02-2026 11:58:15 AM
హైదరాబాద్: కేంద్రంలోని బీజేపీ తీరు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత(Telangana Jagruthi President Kavitha) అన్నారు. ఐఐఎం, నవోదయాలు, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఇంకా ఇవ్వట్లేదని కవిత ప్రశ్నించారు. మెట్రో రైల్ ఫైజ్ -2 గురించి బడ్జెట్ లో ప్రస్తావనే లేదన్నారు. తెలుగింటి ఆడబిడ్డ నిర్మాలా సీతారామన్ తెలంగాణ ప్రజలను ప్రజలను విమర్శించారని పేర్కొన్నారు. పునర్విభజన చట్టంలోని అంశాలు 12ఏళ్లుగా పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని ఒక్క ప్రాజెక్టుకు కూడా జాతీయ హోదా ఇవ్వలేదని ప్రశ్నించారు.
కొత్త ఎయిర్ పోర్టులు, ఆర్ఆర్ఆర్ ను పెండింగ్ లోనే పెట్టారని కవిత స్పష్టం చేశారు. విద్య, వైద్యానికి 1,2 శాతమే నిధులు కేటాయించటం దారణమని మండిపడ్డారు. మున్సిపల్ ఎన్నికల్లో మంచి అభ్యర్థులను ఎన్నుకోవాలని తెలిపారు. పుర ఎన్నికల్లో జాగృతి నేతలు ఏఐఎఫ్ భీ గుర్తుతో పోటీచేస్తున్నట్లు వెల్లడించారు. మోదీ బడే భాయ్ అంటూ సీఎం ఢిల్లీకి 30 సార్లు తిరుగుతారు. 30 సార్లు ఢిల్లీకి తిరిగి రూ. 30 కోట్లు కూడా సాధించలేదని కవిత ఆరోపించారు. గత రెండేళ్లలో అగ్నిప్రమాదాల్లో 22 మంది చనిపోయారని తెలిపిన కవిత అగ్నిప్రమాదాల నివారణకు ఏమాత్రం చర్యలు తీసుకోలేదని వెల్లడించారు.