16 April, 2026 | 9:05 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

పీపీ యూనిట్ ముందు పసిబిడ్డలతో బాలింతల పడిగాపులు

02-02-2026 11:29 AM

నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లా జనరల్ ఆసుపత్రిలోని పీపీ యూనిట్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా వ్యాక్సినేషన్ కోసం వచ్చే బాలింతలు, చిన్నారులతో వచ్చిన తల్లులకు పడిగాపులు తప్పడం లేదు. గంటల తరబడి కాళ్లకు తిమ్మిర్లు వచ్చే దాక వ్యాక్సిన్ కోసం పడిగాపులు కాస్తున్నారు. ఉదయం 10 గంటలు దాటినా సిబ్బంది విధులకు హాజరు కాకపోవడంతో వ్యాక్సినేషన్ సేవలు నిలిచిపోతున్నాయి.

విధుల్లో ఉండాల్సిన వైద్యాధికారులు హైదరాబాద్ వంటి పట్టణాల్లో మఖాం వేయడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి నెలకొంది. ఈ అంశంపై పలుమార్లు ఫిర్యాదులు వచ్చినా సంబంధిత మెడికల్ ఆఫీసర్ ఒక్కరోజు కూడా స్పందించకపోవడం పట్ల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పీపీ యూనిట్ పనితీరుపై తక్షణమే ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు