మోసానికి మారుపేరు కాంగ్రెస్
హైదరాబాద్: మోసానికి మారుపేరు కాంగ్రెస్ పార్టీ అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత(Telangana Jagruthi President Kalvakuntla Kavitha) అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీలైన మహిళలకు నెలకు రూ.2,500, వృద్ధులు, దివ్యాంగులు సహా ఇతర పింఛన్లు పెంచాలని, కళ్యాణ లక్ష్మీతో పాటు తులం బంగారం ఇవ్వాలని, అంగన్ వాడీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ప్రజా భవన్ ఎదుట మహిళలతో కలిసి కవిత ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.... రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 26 నెలలు అయ్యిందని, కానీ ఇప్పటి వరకు మహిళలకు రూ.2500, తులం బంగారం, విద్యార్థినులకు స్కూటీలు, 4000 వేల పింఛన్ పెంపు హామీని మాత్రం అమలు చేయలేదని ఆరోపించారు. రాబోయే బడ్జెట్ లో మహిళలకు రూ. 2500, విద్యార్థినులకు స్కూటీలు, 4000 పింఛన్ కోసం నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్ చేశారు.




