17-02-2026 03:30:24 PM
కామారెడ్డి: జిల్లాలోని జుక్కల్ అటవీ శాఖ కార్యాలయాన్ని గ్రామ సర్పంచులు ముట్టడించారు. జుక్కల్ పట్టణ పరిసర ప్రాంతాల్లో చిరుత పులి సంచారిస్తుందని, దీంతో గ్రామాల్లోని తమ ప్రజలు భయాందోళనకు గురివుతున్నారని అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అటవీ శాఖ అధికారులకు ఎన్నిసార్లు సమాచారం అందించిన ఫలితం లేకపోవడంతో సర్పంచులు జుక్కల్ అటవీ శాఖ కార్యాలయం ముట్టడించడంతో అధికారులకు సర్పంచుల మధ్య వాగ్వాదం జరిగింది. చిరుతను పట్టుకుంటారా లేదా అంటూ సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేశారు.