7 April, 2026 | 3:28 PM

Breaking News

ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి   •   రేపే ఎన్ఎస్ఎస్ రాష్ట్ర స్థాయి సెమినార్   •   అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్   •   సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే   •   కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన కోవ లక్ష్మి   •   ప్రజలు మధ్యవర్తులను నమ్మవద్దు   •   కన్నాలలో బాలామృతం కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ గుడిసె గట్టయ్య   •   కేంద్రం కీలక నిర్ణయం.. 5 కిలోల గ్యాస్‌ సిలిండర్ల సరఫరా పెంపు   •   నల్గొండ జిల్లాలో ఘోరప్రమాదం: విద్యుత్ స్తంభాల ట్రాక్టర్ బోల్తా— ఇద్దరు మృతి   •   హైదరాబాద్‌లో కలకలం... కూకట్‌పల్లి JNTUకు బాంబు బెదిరింపు   •  

సంత్ సేవాలాల్ జయంతి శుభాకాంక్షలు తెలిపిన కవిత

15-02-2026 02:34 PM

హైదరాబాద్: సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి సందర్భంగా అందరికీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ జాగృతి కార్యాలయంలో బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ 287వ జయంతి వేడుకల్లో ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా భోగ్ బండార్ నిర్వహించి, సేవాలాల్ విగ్రహం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు.

బంజారాల్లో సామాజిక, ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపిన దార్శనికుడు సేవాలాల్ మహరాజ్ సమానత్వం, సేవ, ధర్మం కోసం జీవితాన్ని అంకితం చేసిన సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్.రూప్ సింగ్, పలువురు బంజారా పూజారులు, జాగృతి బంజారా నాయకులు పాల్గొన్నారు.