calender_icon.png 17 February, 2026 | 9:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసీఆర్ జన్మదిన వేడుకలు

17-02-2026 03:46:12 PM

కొల్చారం,(విజయక్రాంతి): మండల కేంద్రమైన కొల్చారంలో బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినోత్సవ వేడుకలను మంగళవారం  ఘనంగా నిర్వహించారు. మండల పార్టీ అధ్యక్షులు రాంపల్లి గౌరీ శంకర్, యువజన విభాగం మండల శాఖ అధ్యక్షులు కోనాపూర్ సంతోష్ రావుల ఆధ్వర్యంలో కేసీఆర్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు. అనంతరం ప్రభుత్వ  దవాఖాన, కస్తూర్బా గాంధీ  బాలికల గురుకుల విద్యాలయంలో విద్యార్థినులకు   పండ్లు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ... అభివృద్ధి,సంక్షేమాలకు చిరునామాగా తెలంగాణను నిలిపిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, దేశ రాజకీయాల్లో తిరుగులేని నేతగా ఎదగాలని ఆకాంక్షించారు. రాష్ట్ర ప్రజలందరికీ గతంలో కేసీఆర్ నాయకత్వంలో చేపట్టిన సంక్షేమం సేవలు కావాలని అన్నారు.ప్రజల దీవెనలతో కేసీఆర్ నిండు నూరేళ్లు జీవించాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో కొల్చారం మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు యాబన్నగారి రవితేజ రెడ్డి, సర్పంచులు స్వామి, ఆంజనేయులు, మహేష్, విజయ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు  కరంట్ రాజాగౌడ్, పూలెబోయిన మల్లేశం, రమణ, గోదావరి, ప్రవీణ్ కుమార్,సందీప్, బాగారెడ్డి, ధనరాజ్, గౌరీ శంకర్, కాశీనాథ్, సిద్దు, సురేష్ గౌడ్, మురళి, శ్రీకాంత్, భాగయ్య,శంకర్, భాస్కర్, గ్యాస్ కృష్ణ, ఆర్కేలా నాగయ్య, ఆశన్నగారి కిష్టయ్య,కోరాంపల్లి గోపి, ఆశమ్మోళ్ల సత్తెనారి, దుర్గాప్రసాద్ గౌడ్, పాండ్ర వెంకటేశం, పంతులు శీను, షౌకత్ తదితరులు పాల్గొన్నారు.