15 April, 2026 | 12:37 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

తెలంగాణ భవన్‌లో కేసీఆర్ జన్మదిన వేడుకలు

17-02-2026 12:39 PM

హైదరాబాద్: తెలంగాణ భవన్‌లో (Telangana Bhavan) బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి ఆధ్వర్యంలో జరిగిన వేడుకలకు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీష్ రావు, మహమూద్ అలీ, జగదీష్ రెడ్డి, వి. శ్రీనివాస్ గౌడ్, కొప్పుల ఈశ్వర్, లక్ష్మా రెడ్డి, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్,  పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్, నవీన్ కుమార్ రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్ రావు, బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్, తదితర నాయకులు ముఖ్య అతిథులుగా హాజరై కేక్ కట్ చేశారు. 

తెలంగాణ తల్లి విగ్రహానికి కేటీఆర్, తలసాని శ్రీనివాస్, హరీశ్ రావుతో పాటు పలువురు నేతలు నివాళులర్పించారు. కేసీఆర్ ఉద్యమ ప్రస్థానం, పదేళ్ల పాలనపై డాక్యుమెంటరీ విడుదల చేశారు. డాక్యుమెంటరీని నేతలు వీక్షించారు. అనంతరం  బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) మీడియా సమావేశంలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. 'జల్, జంగల్, జమీన్ కోసం పోరాడిన కుమురం భీమ్ జాతి మాది. అస్థిత్వం కోసం అమరులైన సమ్మక్క-సారక్క జాతి మాది, కోటలపై జెండా ఎగురవేసిన బహు జన వీరుడు సర్వాయి పాపన్న జాతి మాది, భూస్వాముల దోపిడీపై పోరాడిన దొడ్డి కొమురయ్య జాతి మాది.'అని పేర్కొన్నారు.

పదవుల కోసం కాంగ్రెస్, బీజేపీ అక్రమ పొత్తు

మున్సిపాలిటీల్లో పదువుల కోసం కాంగ్రెస్ ,బీజేపీ అక్రమ పొత్తు పెట్టుకున్నాయని మాజీ మంత్రి హరీశ్ రావు(Former Minister Harish Rao) మండిపడ్డారు. పదువుల కోసం కాంగ్రెస్, బీజేపీ సిద్ధాంతాలను పక్కన పెట్టాయని ఆరోపించారు. తెలంగాణ కోసం కేసీఆర్ పదవులను గడ్డిపోచలా వదులుకున్నారని తెలిపారు. చరిత్రలో కేసీఆర్ తిన్న తిట్లు, శాపాలు ఎవరూ తినలేదని చెప్పారు. కేసీఆర్ పై ఎన్ని కుట్రలు చేసినా మొండిధైర్యంతో తెలంగాణ సాధించారని కొనియాడారు.