ఇదో చిల్లర ప్రభుత్వం, ఆ మాటలేంటి? ఆ కూతలేంటి?
- సోనియా గాంధీ చెప్పినా— నేను రాజీపడలేదు
- బొందల పడ్డట్టు అయింది: కేసీఆర్
- BRS జిల్లా, రాష్ట్ర కమిటీలు రద్దు.. కేసీఆర్ సంచలన నిర్ణయం
- ప్రభుత్వానికి చేతకావట్లేదు: తెలంగాణ ప్రజలు ఆవేదన
హైదరాబాద్: తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ రజతోత్సవ(BRS Silver Jubilee Celebration) ముగింపు కార్యక్రమం నిర్వహించారు. బీఆర్ఎస్ రాష్ట్ర ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ... రాష్ట్రంలో రైతుల పరిస్థితి దిగజారిపోయిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ధాన్యం కొనడం చేతకావట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఏం జరుగుతోందో అర్థం కావట్లేదని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు ఆవేదన చెందుతున్నారని కేసీఆర్ తెలిపారు. బొందల పడ్డట్లు అయిందని తెలంగాణ ప్రజలు ఆవేదన చెందుతున్నారని కేసీఆర్ చెప్పారు.
ఇదో చిల్లర ప్రభుత్వం.. ఆ మాటలు ఏంటి? ఆ కూతలేంటి? అని కేసీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ గురించి బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య(BJP MP Tejasvi Surya) ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని కేసీఆర ఫైర్ అయ్యారు. తేజస్వి వ్యాఖ్యలపై కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు ఒక్కమాట మాట్లాడలేదని కేసీఆర్ ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ ఎంపీలు లోక్ సభలో ఉండి ఉంటే రణరంగం సృష్టించేవాళ్లని ఆయన వెల్లడించారు. కాళేశ్వరంపై రాజ్యసభలో సీఆర్ పాటిల్ మాట్లాడితే సురేశ్ రెడ్డి గట్టిగా ఖండించారని కేసీఆర్ కొనియాడారు. తెలంగాణ గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే కాంగ్రెస్, బీబీజేపీ నేతలు ఏంచ చేస్తున్నారని కేసీఆర్ మండిపడ్డారు. నన్ను ఎన్నోసార్లు, ఎంతో మంది మానసిక క్షోభకు గురిచేశారని కేసీఆర్ గుర్తుచేశారు.
హైదరాబాద్ విషయంలో రాజీపడాలని సోనియాగాంధీ ఎన్నో సార్లు చెప్పిన విషయాన్ని కేసీఆర్ ప్రస్తావించారు. సోనియా గాంధీ ఎన్నిసార్లు చెప్పినా తాను రాజీపడలేదని.. అది తన చిత్తశుద్ధి అని కేసీఆర్ వెల్లడించారు. చంద్రబాబుతో జై తెలంగాణ అనిపించేందుకే 2009లో టీడీపీతో పొత్తు పెట్టుకున్నామని గుర్తుచేశారు. మిత్రుడు అశోక్ గులాటీ సలహాతోనే రైతుబంధు పథకం తీసుకొచ్చినట్లు కేసీఆర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర కమిటీ మినహా మిగతా అన్ని కమిటీలు రద్దు చేస్తూ కేసీఆర నిర్ణయం తీసుకున్నారు. ఆన్ లైన్, ఆఫ్ లైన్ లో పార్టీ సభ్యత్వ నమోదు చేపట్టనున్నట్లు కేసీఆర్ వెల్లడించారు. బీఆర్ఎస్ కార్యకర్తలకు శిక్షణ ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయించారు.






