1 September, 2026 | 3:51 PM

రామోజీ రావు మృతిపట్ల మోదీ సంతాపం

08-06-2024 10:42 AM

హైదరాబాద్: రామోజీరావు మృతి పట్ల కాబోయే ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. రామోజీరావు అస్తమయం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందన్నారు. మీడియాను విప్లవాత్మకంగా మార్చిన దార్శనికుడు రామోజీ అన్నారు. పత్రికారంగంలో సరికొత్త ప్రమాణాలు నెలకొల్పారు.. పత్రిక, సినీ, వ్యాపార రంగాలపై రామోజీరావు చెరగని ముద్ర వేశారు మోదీ కొనియాడారు. మీడియాలో రామోజీరావు సరికొత్త ప్రమాణాలు నెలకొల్పారన్నారు. రామోజీరావు ఎప్పుడూ దేశాభివృద్ధి కోసమే ఆలోచించారని ప్రధాని తెలిపారు. రామోజీరావుతో మాట్లాడే అవకాశం తనకు ఎన్నోసార్లు దక్కిందని.. ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని చెప్పారు. రామోజీరావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాని పేర్కొన్నారు.