30 July, 2026 | 1:24 AM

కేసీఆర్ పై కేసు.. కొట్టేయాలని హైకోర్టులో పిటిషన్

24-06-2024 09:25 PM

హైదరాబాద్ : తనపై నమోదైన కేసును కొట్టివేయాలని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హైకోర్టు ఆశ్రయించారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో భాగంగా 2011 అక్టోబర్ లో రైల్ రోకోకు పిలుపునిచ్చారని మల్కాజ్ గిరి పోలీసులు కోర్టుకు నివేదికను సమర్పించారు.

దీంతో పలు రైళ్ల రాకపోకలకు, రైల్వే ఉద్యోగులకు ఆటంకం కలిగించారని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన కేసిఆర్ తాను ఎలాంటి పిలుపునివ్వలేదని, ఎవరో ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా తనపై కేసులు నమోదు చేశారని పిటిషన్ లో తెలిపారు. రైల్ రోకో ఘటన తర్వాత మూడేళ్లకు తెలంగాణ ఏర్పడిందన్నారు. తనపై ప్రజాప్రతినిధుల కోర్టులో నమోదైన కేసును కొట్టివేయాలని కోరారు.