జీవన్ రెడ్డిని బుజ్జగిస్తున్న శ్రీధర్ బాబు
24-06-2024 08:57 PM
హైదరాబాద్ : జగిత్యాల ఎంఎల్ఎ సంజయ్ ను కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోవడంపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. దీంతో ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో మంత్రి శ్రీధర్ బాబు బుజ్జగించేందుకు జగిత్యాలలోని ఆయన ఇంటికి చేరుకున్నారు. ఇటీవల జరిగిన పరిణామాల గురించి మంత్రి చర్చించారు. శ్రీధర్ బాబు వెంట ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, ఎంఎల్ఎ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తో పాటు పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు జీవన్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు.






