ఎర్రవెల్లి నుండి హైదరాబాద్ బయల్దేరిన కేసీఆర్
19-02-2025 12:18 PM
హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు(Kalvakuntla Chandrashekar Rao) ఎర్రవల్లి ఫామ్‌హౌస్ నుంచి హైదరాబాద్ బయల్దేరారు. తెలంగాణ భవన్‌లో జరిగే విస్తృతస్థాయి సమావేశానికి కేసీఆర్ హాజరుకానున్నారు. ఆయన ఎర్రవల్లి నుంచి నేరుగా సికింద్రాబాద్ పాస్‌పోర్ట్ ఆఫీస్(Secunderabad Passport Office)కు వెళ్లారు. పాస్‌పోర్ట్ అప్‌డేట్ చేసుకుని నందినగర్ నివాసానికి పయనం అయ్యారు. నంది నగర్(Nandi Nagar) నుంచి మధ్యాహ్నం ఒంటి గంటకు కేసీఆర్ తెలంగాణ భవన్(Telangana Bhavan)కు చేరుకుంటారు. కేసీఆర్ వచ్చే నెలలో అమెరికాకు వెళ్లనున్నారు. అమెరికాలో ఉంటున్న తన మనువడు హిమాన్షు వద్ద కొన్ని రోజులు ఉండనున్నారు.




