5 August, 2026 | 10:40 PM

యుద్ధ ప్రాతిపదికన పైపులైన్ పనులు పూర్తి

05-08-2026 10:04 PM

మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ 

సుల్తానాబాద్,(విజయ క్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణములో రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నందున మరియు నూతన అమృత్ పైప్ లైన్ వేసే క్రమంలో   గట్టేపల్లి పైప్ లైన్ పగిలి నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడగా బుధవారం మున్సిపల్ చైర్మన్ బిరుదు రాధాకృష్ణ, కమిషనర్ రమేష్ లు పర్యవేక్షించి పైప్ లైన్ లీకేజీ పనులు మున్సిపల్ సిబ్బందిచే యుద్ధప్రాతిపదికన పూర్తి చేశారు. గురువారం నుండి యధావిధిగా మంచినీటి సరఫరా పట్టణంలో చేయడం జరుగుతుందని,  అదేవిధంగా నేడు శివాలయం వద్ద రోడ్డుపై ప్రజలకు వాహనముల  నుండి ఇబ్బందులు లేకుండా ఉండుటకై  ప్రభుత్వ విప్ , ఎమ్మెల్యే  చింతకుంట విజయ రమణారావు  ఆదేశాల మేరకు చైర్పర్సన్ బిరుదు రాధాకృష్ణ  పర్యవేక్షణలో రోడ్డు ప్రమాదాలు నివారించుటకై ప్లాస్టిక్ స్పీడ్ బ్రేకర్లు బిగించనైనది. ఈ కార్యక్రమంలో  వైస్ చైర్పర్సన్ అంతటి పుష్పలత , వార్డు కౌన్సిలర్లు గాజుల రాయమల్లయ్య ,  ఊట్ల వర ప్రదీప్, సిద్ధ తిరుపతి , తొర్రికొండ ప్రభాకర్  పాల్గొన్నారు.