25 August, 2026 | 10:00 PM

ఏఐజీ ఆస్పత్రికి మరోసారి కేసీఆర్

15-06-2025 01:30 AM
  1. వైద్యుల సూచన మేరకు రెండోసారి..
  2. కొంత కాలంగా జలుబుతో బాధపడుతున్న మాజీ సీఎం

శేరిలింగంపల్లి, జూన్ 14: మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి శనివారం మరోసారి వెళ్లారు. గత కొంత కాలంగా జలుబుతో బాధపడుతున్న కేసీఆర్.. ఆరోగ్య పరీక్షల కోసం శనివారం ఉదయం ఏఐజీ ఆస్పత్రికి వెళ్లారు. ఆయన వెంట మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, ఎమ్మెల్సీ కవిత, మాజీ ఎంపీ సంతోష్ ఉన్నారు.

శుక్రవారమే ఆస్పత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకున్న గులాబీ బాస్ మరోసారి వైద్యుల సూచన మేరకు ఆస్పత్రికి వెళ్లారు. వైద్య పరీక్షలు పూర్తి అయిన తర్వాత నందీనగర్‌లోని నివాసానికి వెళ్లారు. ఐదు రోజుల పాటు నందీనగర్‌లోనే ఉండనున్నా రు. కాగా ప్రతీ రెండు నెలలకు ఒకసారి కేసీఆర్ ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకుంటారు.

గతంలో యశోదా ఆస్పత్రికి కేసీఆర్ తరచుగా వెళ్తుండేవారు. ఈసారి గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి వెళ్లారు. గడిచిన ఏడా దిన్నర కాలంగా కేసీఆర్ ఎర్రవల్లి ఫాంహౌస్‌లోనే ఉంటున్నారు. అందుబాటులో ఉండా లని వైద్యులు చెప్పిన నేపథ్యంలో బంజారాహిల్స్ నందినగర్‌లోనే ఉండనున్నారు.