calender_icon.png 16 June, 2025 | 12:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ద్వాదశ రాశిఫలాలు

15-06-2025 12:51:47 AM

15.-6--.2025 నుంచి 21.-6.-2025 వరకు

రామడుగు రంగన్న సిద్ధాంతి :

మేషం

ఈ వారంలో ఈ రాశివారికి గ్రహస్థితి మధ్య మంగా ఉంది. ఆర్థిక వ్యయమవుతుంది. బంధుమిత్రులతో సంతోషంగా ఉంటా రు. కొత్తవారితో పరిచయాలు పెరుగుతాయి. శుభవార్తలు వింటారు. యువతీ యువకులకు చేసే పనులలో ఆటంకా లు కలుగుతాయి. ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది. స్థానచలనాలు ఉంటాయి. వ్యాపారస్తులు సామాన్యలాభాలు పొందుతారు. విద్యార్థులకు చదువులలో ఆటంకాలు కలుగుతాయి. రైతులు జాగ్రత్తగా ఉండాలి. మొత్తం మీద ఈ రాశివారికి 40 శాతం అనుకూలత, 60 శాతం ప్రతికూలత ఉంది. 

వృషభం

ఈ రాశివారికి ఈవారంలో గ్రహస్థితి మంచిగా ఉంది. జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక లాభాలు కలుగుతాయి. బంధుమిత్రులతో సంతోషంగా ఉంటారు. యువతీ యువకులు ఉద్యోగ, పెండ్లి విషయాలు ఫలిస్తాయి. విజయాలు సాధిస్తారు. ఉద్యోగస్తులకు అధికారులతో శుభవార్తను వింటారు. వ్యాపారస్తులకు చాలా లాభాలు కలుగు తాయి. విద్యార్థులు సంతోషంగా ఉంటారు. విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి. రైతులకు లాభాలు ఉంటాయి. -ఆరోగ్యం పట్ల జాగ్రత్త ఉండాలి. -మొత్తం మీద ఈ రాశివారికి 75 శాతం అనుకూలత, 25 శాతం ప్రతికూలత ఉంది.  

మిథునం

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి మధ్యరకంగా ఉంది. శారీరక అనారోగ్యం కలుగుతుంది. స్థలమార్పు జరుగుతుంది. కొంత మానసిక అశాంతి కలుగుతుంది. అధిక ధనవ్యయమవుతుంది. బంధుమిత్రులతో స్పర్ధలు ఏర్ప డతాయి. యువతీ యువకులకు వివా హ, ఉద్యోగ ప్రయత్నాలు ఆలస్యమవుతాయి. విద్యార్థులు చదువులలో ముం దుంటారు. వ్యాపారస్తులు, రైతులకు చేసే పనులలో జాగ్రత్త అవసరం. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. మొత్తం మీద ఈ రాశివారికి 50 శాతం అనుకూలత, 50 శాతం ప్రతికూలత ఉంది. 

కర్కాటకం

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి సామాన్యంగా ఉంది. శుభకార్యాలు ఫలిస్తాయి. బంధువులతో మంచిగా ఉంటారు. దీర్ఘకాలిక సమస్య లు తీరుతాయి. యువతీ యువకులకు అనుకున్న వారితో వివాహాలు జరుగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులు ఉత్సాహంగా చదువుతారు. ఉద్యోగస్తులకు ధనలాభం కలుగుతుంది. వ్యాపారస్తులు, రైతులకు చేసే పనులలో సామాన్య లాభం ఉంటుంది. మొత్తం మీద ఈ రాశివారికి 60 శాతం అనుకూలత, 40 శాతం ప్రతికూలత ఉంది. 

సింహం

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి మధ్యరకంగా ఉంది. పనులలో ఆటంకాలు ఉంటాయి. బుద్ధి స్థిరంగా ఉండదు. తీసుకొనే నిర్ణయాలలో జాగ్రత్త అవసరం. ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. యువతీ యువకులకు ఉద్యోగ-, వివాహ ప్రయత్నాలు ఆలస్యం గా ఫలిస్తాయి. విద్యార్థులకు చదువులలో జాగ్రత్త అవసరం. వ్యాపార స్తులకు, రైతులకు సామాన్య లాభాలుంటాయి. ఉద్యోగస్తులకు ఒత్తిళ్లు కలుగుతా యి. ఆర్థిక లాభాలు ఉంటాయి. మొత్తం మీద ఈ రాశివారికి 35 శాతం అనుకూలత, 65 శాతం ప్రతికూలత ఉంది. 

కన్య

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి అనుకూలంగా ఉంది. శుభవార్తలు వింటారు. శుభకార్యాలు చేస్తారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మంచివారితో పరిచయాలు కలుగుతాయి. సహనంతో పని చేస్తే సత్ఫలి తాలు పొందుతారు. యువతీ యువకులకు కోరుకున్న వారితో వివాహ నిశ్చయాలు జరుగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు విదేశీయాన ప్రయత్నాలు నెరవేరుతాయి. వ్యాపారస్తులకు, రైతులకు క్రయ విక్రయాలలో సామాన్య లాభాలు ఉంటాయి. మొత్తం మీద ఈ రాశివారికి 65 శాతం అనుకూలత, 35 శాతం ప్రతికూలత ఉంది.

తుల

--ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి అనుకూలంగా ఉంది. మంచివారితో పరిచయాలు ఏర్పడతా యి. ఆర్థిక లాభాలు కలుగుతాయి. ప్రయాణాలు చేస్తారు. బంధువులతో స్పర్ధలు కలుగుతాయి. చేసే పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. యువతీ యువకులకు వివాహ విషయంలో పురోగతి ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నా లు ఫలిస్తాయి. విద్యార్థులు శుభవార్తలు వింటారు. ఉద్యోగస్తులకు పనిభారం పెరుగుతుంది. ఆర్థిక లాభాలు కలుగుతాయి. వ్యాపారస్తులకు, రైతులకు ప్రతికూల కాలం. మొత్తం మీద ఈ రాశివారికి 45 శాతం అనుకూలత, 55 శాతం ప్రతికూలత ఉంది. 

వృశ్చికం

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి మంచిగా ఉంది. ఆరోగ్య విషయమై కొంత జాగ్రత్త అవసరం. ధనలాభం సిద్ధిస్తుంది. అన్నదమ్ముల మధ్య సఖ్యత కలుగుతుంది. యువతీ యువకులకు ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు చదువులలో శ్రమానంతర ఫలితాలు ఉంటాయి. వ్యాపారస్తులకు, రైతులకు సామాన్య లాభాలు కలుగుతాయి. ఉద్యోగులు ఒత్తిడికి లోనవుతారు. మొత్తం మీద ఈ రాశివారికి 55 శాతం అనుకూలత, 45 శాతం ప్రతికూలత ఉంది. 

ధనుస్సు

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి మధ్యరకంగా ఉంది. చేసే పనులలో సంతృప్తి ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి. శుభవార్తలు వింటారు. ధన వ్యయమవుతుంది. యువతీ యువకులకు మంచివారితో వివాహం జరు గుతుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తా యి. విద్యార్థులు చదువులలో ఉన్నతిని సాధిస్తారు. వ్యాపారస్తులకు, రైతులకు లాభాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు సంతోషంగా ఉంటారు. మొత్తం మీద ఈ రాశివారికి 60 శాతం అనుకూలత, 40 శాతం ప్రతికూలత ఉంది. 

మకరం

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి అనుకూలంగా ఉంది. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు చేస్తారు. ధనవ్యయం అవుతుంది. యువతీ యువకులకు ఉద్యోగ, వివాహ విషయాలలో విజయం కలుగుతుంది. విద్యార్థులకు చదువులలో శ్రద్ధ అవసరం. వ్యాపారస్తులకు, రైతులకు సామాన్య లాభాలు ఉంటాయి. ఉద్యోగస్తులు సంతోషంగా ఉంటారు. మొత్తం మీద ఈ రాశివారికి 60 శాతం అనుకూలత, 40 శాతం ప్రతికూలత ఉంది.

కుంభం

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి ప్రతికూలంగా ఉంది. అన్ని విషయాలలో ఆటంకాలు ఉంటాయి. మనోచాంచల్యం ఉంటుంది. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. మిత్రులతో జాగ్రత్త అవసరం. ధనవ్యయం అవుతుంది. కొత్త పనులు ప్రారంభిస్తారు. యువతీ యువకులకు ఉద్యోగ, వివాహ ప్రయత్నాలలో స్తబ్దత ఏర్పడుతుంది. విద్యార్థులకు చికాకు, అశ్రద్ధ కలుగుతాయి. వ్యాపారస్తులకు, రైతులకు నష్టాలు రావచ్చు. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి ఉంటుంది. మొత్తం మీద ఈ రాశివారికి 45 శాతం అనుకూలత, 55 శాతం ప్రతికూలత ఉంది.

మీనం

ఈ రాశివారికి ఈ వారంలో గ్రహస్థితి మధ్యరకంగా ఉంది. చేసే పనులను ఆలోచించి చేయాలి. శుభకార్యాలు చేస్తారు. ప్రయాణాలవల్ల ధన వ్యయమవుతుంది. బంధుమి త్రులతో భేదాలు కలుగుతాయి. యువతీ యువకులకు ఉద్యోగ, వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విద్యార్థులు చదువులలో స్తబ్దంగా ఉంటారు. వ్యాపారస్తులకు, రైతులకు కాలం అనుకూలించదు. ఉద్యోగస్తులు అనారోగ్యానికి గురవుతారు. మొత్తంమీద ఈ రాశివారికి 45 శాతం అనుకూలత, 55 శాతం ప్రతికూలత ఉంది.