01-02-2026 06:49:46 PM
బెల్లంపల్లి,(విజయక్రాంతి): తెలంగాణ కోసం ప్రాణాలు సైతం లెక్కచే యకుండా రాష్ట్రాన్ని సాధించిన కెసిఆర్ అక్రమ కేసులకు భయపడడనీ బీఆర్ఎస్ పార్టీ బెల్లంపల్లి ఎన్నికల ఇన్చార్జి గోగుల రవీందర్ రెడ్డి అన్నారు. ఆదివారం ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ కెసీఆర్ ను విచారించడాన్ని నిరసిస్తూ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఫోన్ టాపింగ్ కేసు విచారణ పేరిట ప్రభుత్వం రాజకీయ కక్షలు గులాబీ బాస్ ను ఏమీ చేయలేవని అన్నారు.
ప్రజల అండ కెసిఆర్ వద్దన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలులేదన్నారు. ప్రజావ్యతిరేకత నుండి ప్రజల దృష్టినీ మళ్లించేందుకు సీఎం రేవంత్ రెడ్డి డైవర్షన్ రాజకీయాలకు దిగుతున్నారని విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు లేదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ పరిపాలన తీరును ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు. గులాబీ శ్రేణులు పట్టణంలోని కన్నాల ఫ్లైఓవర్ బ్రిడ్జి నుంచి చేపట్టిన బైక్ ర్యాలీ టేకులబస్తీ కన్నాల బస్తీ మెయిన్ బజార్, ఏఎంసీ మీదుగా కాల్ టాక్స్ ఫ్లైఓవర్ బ్రిడ్జి వరకూ ఈ ర్యాలీ సాగింది.
ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ బత్తుల సుదర్శన్ ,పట్టణ అధ్యక్షుడు నూరేటి సత్యనారాయణ, మున్సిపల్ పట్టణ కమిటీ చైర్మన్ సుందర్ రావు, టీ ఆర్ ఎస్ వీ జిల్లా అధ్యక్షుడు బడికల శ్రావణ్, టీబీజికేఎస్ జాయింట్ సెక్రెటరీ దాసరి శ్రీనివాస్, బీ ఆర్ ఎస్ నాయకులు ఏలూరు వెంకటేష్, తాళ్లపల్లి అశోక్ గౌడ్ ,అలవేన సంపత్, నాగవేణి గజేందర్ ,కత్తి శ్రీనివాస్ ఎల్కటూరి పోచన్న, మద్దెల గోపి, ఉమామహేశ్వర్, ఎండీ అనీఫ్ తదితరులు పాల్గొన్నారు.