17 April, 2026 | 3:15 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

ఆ పార్టీలో కర్త, కర్మ, క్రియ అంతా వాళ్లే...

01-02-2026 06:55 PM

25 సంవత్సరాలు ఆ పార్టీకి ఊడిగం చేశా: కొండా నర్సింగరావు

శామీర్ పేట్,(విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీలో ఎస్సీ, ఎస్టీ, బిసి వర్గాలకు చెందిన వారికి అన్యాయం జరుగుతుందని కొండ నర్సింగరావు ఆరోపించారు. ఆదివారం మూడు చింతలపల్లి మున్సిపాలిటీ కేంద్రంలోని బిజెపి కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాట్లాడుతూ.... కాంగ్రెస్ పార్టీ బీసీలకు న్యాయం చేస్తామన్న మాటలతో, సామాజిక సమానత్వమే తమ పాలన లక్ష్యమని చెబుతూ బీసీల విశ్వాసాన్ని కాంగ్రెస్‌ సంపాదించింది. కానీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ మాటలు క్రమంగా మౌనంగా మారాయి.

హామీల స్థానంలో మౌనం, ఆశల స్థానంలో నిరాశ, నమ్మకం స్థానంలో అనుమానం బలపడిందన్నారు. ఈ పార్టీలో కేవలం అగ్రకులాలకు చెందిన వారిదే పెత్తనం నడుస్తుందని అన్నారు. 25 సంవత్సరాలు పార్టీ కోసం పని చేశా అయినా పార్టీలో గుర్తింపు దక్కలేదు అందుకోసమే బిజెపి కండువా కప్పుకున్న అని కొండా నర్సింగరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో బుద్ధి శ్రీనివాస్, గోనె శ్రీనివాస్, నంద్యాల శ్రీనివాస్ , వెంకటేష్ నాయక్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.