16 April, 2026 | 3:09 AM

మొయినాబాద్ కేసులో కేదార్ పేరు

16-04-2026 01:27 AM

హైదరాబాద్, ఏప్రిల్ 15: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సంచలనం రేపిన మొయినాబాద్ ఫాంహౌస్ డ్రగ్స్ కేసులో విచారణ జరుపుతున్న సిట్ అధికారు లకు సంచలన విషయాలు తెలుస్తున్నాయి. పైలట్ బ్రదర్స్‌కు.. గతేడాది దుబాయ్‌లో డ్రగ్స్ ఓవర్ డోస్‌తో చనిపోయిన వ్యక్తితో సంబంధాలు ఉన్నాయని పోలీసుల దర్యప్తులో తేలింది. ఆ వ్యక్తికి పైలట్ బ్రదర్స్‌కు మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు తేలింది. ఈ డబ్బుల గురంచి అడిగితే పొంతనలేకుండా మాట్లాడుతున్నారని పోలీసు లు స్పష్టంలేదని వెల్లడించారు.

ఈ కేసులో తాండూరు మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ నేత పైలట్ రోహిత్ రెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితులు గా అరెస్ట్ అయి జైలుకు వెళ్లిన పైలట్ రోహిత్ రెడ్డి.. ఆయన సోదరుడు రితేష్‌రెడ్డి మరిన్ని చిక్కుల్లో పడు తున్నారు. తాజాగా ఈ కేసు లో మరో వ్యక్తి పేరును సిట్ అధికారులు ప్రస్తావించారు. కేదార్ అనే వ్యక్తి పేరు మొయినాబాద్ ఫాంహౌస్ డ్రగ్స్ కేసు తెరమీదికి వచ్చింది.

గతేడాది దు బాయోలో డ్రగ్స్ అధికంగా తీసుకోవడం వల్ల ఓవర్ డోస్తో కేదార్ ప్రాణా లు కోల్పోయాడు. అయితే ఆ కేదార్తో పైలట్ రోహిత్‌రెడ్డి సోదరులకు దగ్గరి సంబంధాలు ఉన్నట్లు తాజాగా పోలీసులు గుర్తించారు. రోహిత్ రెడ్డి, కేదా ర్కు మధ్య అనేక ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు తేల్చారు.