డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలకు నష్టం
- అధికార పార్టీలో అసంతృప్తి సహజమే
- బీఆర్‌ఎస్‌గా మార్చడంపై ఆత్మవిమర్శ చేసుకోవాలి
- శాసనమండలి చైర్మన్ గుత్తా
నల్లగొండ, ఏప్రిల్ 15 (విజయక్రాంతి) : జనాభా ప్రకారం డీలిమిటేషన్ జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు బుధవారం నల్లగొండలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న సీట్లకు 50 శాతం పెంచేలా కేంద్రం కొత్త విధానం ప్రతిపాదించిందని తెలిపారు. అయితే 50 శాతం జనాభా, 50 శాతం జీఎస్టీ పరంగా చేయాలని పలు రాష్ట్రాలు ప్రతిపాదిస్తున్నాయన్నారు.
మహిళా బిల్లు, డీలిమి టేషన్ బిల్లు వేర్వేరుగా పెట్టాలని పలు రాష్ట్రాలు కోరుతున్నాయని, జమిలీ ఎన్నికలు జరిగితే 18 రాష్ట్రాలు ఒకసారి, మిగిలిన రాష్ట్రాలు ఒకసారి ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందన్నారు. తెలంగాణలో వివిధ రాష్ట్రాల నుంచి20 లక్షల మంది కూలీలు వచ్చి ఉపాధి పొం దుతున్నారన్నారు.
డబ్బు ప్రవాహాన్ని కట్టడి చేస్తే తప్ప భవిష్యత్ రాజకీయాల్లో సామాన్యుడు పోటీ చేసే పరిస్థితి లేదన్నారు.అధికార పార్టీలో అసంతృప్తి సాధారణమే అన్నారు.బీఆర్‌ఎస్‌ను టీఆర్‌ఎస్ గా మారుస్తారని ప్రచారం నడుస్తుందనీ అసలు టీఆర్‌ఎస్ బీఆర్‌ఎస్‌గా ఎందుకు మార్చారో ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. సాగునీటి కాలువలను విస్తరించాలన్నారు.






