28 June, 2026 | 12:26 PM

Breaking News

పోస్ట్ మెట్రిక్ హాస్టల్ వర్కర్లపై వేధింపులు ఆపాలి: పీవైఎల్   •   పోలియో రహిత సమాజ నిర్మాణం అందరి బాధ్యత   •   పసిపిల్లల ఆరోగ్యానికి ఆ రెండు చుక్కలే రక్ష   •   సీసీ కెమెరాలతో గ్రామంలో పటిష్టమైన భద్రత   •   రోజువారి కూలీల జేబుకు చిల్లు పెడుతున్న మద్యం మాఫియా   •   రేవంత్ రెడ్డి నల్లగొండ సభ వేళ బీఆర్ఎస్ నాయకుల అరెస్ట్   •   ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు వేయించాలి   •   రాష్ట్రవ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం   •   పీవీ నరసింహారావు జయంతి సందర్భంగా నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి   •   పి.వి. నరసింహారావుకి నివాళులర్పించిన కిషన్ రెడ్డి, బండారు దత్తాత్రేయ   •  

ఉద్యోగ భద్రత వచ్చేవరకు ఉద్యమం చేయండి

26-04-2025 12:11 AM

పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రాఘవాచారి

మహబూబ్ నగర్ ఏప్రిల్ 25 (విజయ క్రాంతి) : ఉద్యమించడం తెలంగాణ పౌర సమాజానికి కొత్త కాదని, తరతరాలుగా ఆధిపత్యం పై ఉద్యమించి విజయాలను సాధించిన ఘనత, ఘన చరిత్ర ఈ ప్రాంతానికి ఉందని పాలమూరు అధ్యయన వేదిక అధ్యక్షులు ఎం. రాఘవాచారి అన్నారు. శుక్రవారం విశ్వవిద్యాలయాల కాంట్రాక్ట్ అధ్యాప కులు చేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు ఆయ న మద్దతు తెలిపి మాట్లాడారు. 

ఉద్యమాన్ని మరింత ఉత్సాహంతో కొనసాగించి తమ హక్కులు సాధించుకోవాలని, అందుకు  పౌర సమాజమంత బాసటగా నిలవాలన్నా రు. ప్రభుత్వాలు విద్య పట్ల ప్రదర్శిస్తున్న సవతి తల్లి ప్రేమకు నిదర్శనమే నేడు కాంట్రాక్టు అధ్యాపకులు చేస్తున్న నిరవధిక సమ్మె అని, ఉన్నత విద్యావంతులైన యూనివర్సిటీ అధ్యాపకులు సమాజానికి, విద్యార్థు లకు దిశా నిర్దేశం చేస్తున్న అధ్యాపకులు టెం ట్ కింద కూర్చోవడం సభ్య సమాజానికి తలవంపు అని, ఎన్నికల ముందు తాము ప్రకటించిన వాగ్దానాలను నిలబెట్టుకొని వెంటనే కాంట్రాక్టు అధ్యాపకుల న్యాయమైన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంట్రాక్టు అధ్యాపకులు ఉన్నారు.