కన్నుల పండువగా కీర్తి సురేశ్ వివాహం
నటి కీర్తి సురేశ్ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఆమె స్నేహితుడు, ప్రియుడు ఆంథోనీ తటిల్ తో ఏడడుగులు వేశారు. గోవాలోని ఒక ప్రముఖ రిసా ర్ట్‌లో వీరి వివాహం ఇరు కుటుంబాల పెద్దలు, అత్యంత సన్నిహితుల సమక్షంలో కన్నుల పండువగా జరిగింది. వివాహానికి సంబంధించిన ఫోటోలను కీర్తి సోషల్ మీ డియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కొత్త జంటకు సినీ ప్రముఖులు, అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు చెబుతున్నారు.
ఇటీవల దీపావళి వేడుకల్లో భాగంగా ఆంథోనీతో తీసుకున్న ఫోటోతో కీర్తి తన వివాహ ప్రకటన చేశారు. దాదాపు 15 ఏళ్ల తమ స్నేహబంధం ఇకపై జీవితాంతం కొనసాగనుందని సోషల్ మీడియా వేదికగా వెల్లడిం చారు. ఆంథోని గొప్ప వ్యాపారవేత్త. ఆయనకు కొచ్చి, చెన్నై సహా దుబాయ్‌లో వ్యాపారాలున్నాయని సమా చారం. స్కూల్ డేస్ నుంచి కీర్తి, ఆంథోని స్నేహితులు. కాలేజీ రోజుల్లో వారిద్దరి స్నేహం ప్రేమగా మారిందట. ప్రస్తుతం కీర్తి సురేశ్ ‘రివాల్వర్ రీటా‘, ‘బేబీ జాన్’ చిత్రాల్లో నటిస్తున్నారు. ’బేబీ జాన్‘తో బాలీవుడ్‌లో కీర్తి అడుగు పెడుతున్నారు.






