12 July, 2026 | 3:33 PM

Breaking News

సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు లేఖ   •   ముంబైలోని తాజ్ హోటల్‌కు బాంబు బెదిరింపు కాల్   •   చింతల బోరి పంచాయతీలో హెల్ప్ డెస్క్ లో పాల్గొన్న ఉప సర్పంచ్.   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్   •   ఘనంగా శ్రీ హనుమాన్ చాలీసా సామూహిక పారాయణ   •   సీఎం రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం   •   ప్రతి వ్యక్తి ఓటరుగా నమోదు చేయించుకోవాలి   •   రూ.339.59 కోట్లతో భువనగిరి–చిట్యాల నాలుగు లేన్ల రహదారికి శంకుస్థాపన.   •   ఈ నెల 14న కళాశాల బంద్ విజయవంతం చేయాలి   •   ప్రజలకు నాణ్యమైన రహదారి, మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం   •  

హ్యాపీ బర్త్డే

13-12-2024 12:00 AM

ప్రముఖ నటుడు వెంకటేశ్ పుట్టినరోజు నేడు. ఆయన 1960 డిసెం బర్ 13న ప్రకాశం జిల్లా కారంచేడు లో జన్మించారు. తొలుత నిర్మాతగా రాణించాలని వెంకటేశ్ భావించారు.  ఆ తరువాత 1966లో ‘కలియుగ పాండవులు’ చిత్రంతో వెండితెరకు  హీరోగా పరిచయమయ్యారు. తొలి సినిమా మంచి సక్సెస్ కావడంతో పాటు ఆయనకు నంది అవార్డును తెచ్చిపెట్టింది. ఇప్పటి వరకూ 70కి పైగా చిత్రాల్లో వెంకటేశ్ నటించారు. ఆయన చిత్రాల ద్వారా చాలా మంది హీరోయిన్స్ ఇండస్ట్రీకి పరిచయమయ్యారు.

సీనియర్ నటి లక్ష్మి పుట్టినరోజు నేడు. ఆమె 1952 డిసెం బర్ 13న మద్రాస్‌లో జన్మించా రు. లక్ష్మి తన 15వ ఏటనే సినీరంగ ప్రవేశం చేశారు. 1968లో ‘జీవనాంశమ్’ అనే తమిళ చిత్రం ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు. ఆ తరువాత లక్ష్మి దక్షి ణాది భాషలన్నింటిలోనూ నటించారు. ‘అల్లుడా మజాకా, మురారి, లాహిరి లాహిరి లాహిరిలో, మిథునం’ వంటి ఎన్నో చిత్రాలతో ఆమె టాలీవుడ్ ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. 

హీరోయిన్ రెజీనా పుట్టినరోజు నేడు. ఆమో 1990 డిసెంబర్ 13న మద్రాస్‌లో జన్మించారు. తమిళ్, తెలుగు భాషల్లో ఎక్కువగా చిత్రాలు చేశారు. ‘కంద నాల్ ముదల్’ అనే తమిళ చిత్రంతో సినీ పరిశ్రమకు పరిచయమయ్యారు. ‘శివ మనసులో శృతి’ అనే చిత్రంతో టాలీవుడ్‌లో అడుగు పెట్టారు. బాలీవుడ్‌లోనూ రెజీనా కొన్ని చిత్రాలు చేశారు. ‘ఏక్ లడ్‌కీ కో దేఖాతో ఐసా లగా’ చిత్రం తో బాలీవుడ్‌కు పరిచయమయ్యారు.