మామిడి పండ్లు తింటున్న కేజ్రీవాల్

19-04-2024 12:20:00 AM

షుగర్ లెవల్స్ పెంచుకునే ప్రయత్నమన్న ఈడీ 

న్యూఢిల్లీ, ఏప్రిల్ 18:  లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటూ తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ కోసం చెక్కెర లెవెల్స్ పెంచుకునేందుకు మామిడిపండ్లు, మిఠాయిలు తింటున్నారని ఈడీ ఆరోపించింది. షుగర్ లెవల్స్ పెరుగుతున్నాయని, వారంలో ౩ సార్లు వైద్యనిపుణుడిని సంప్రదించేందుకు అనుమతివ్వాలని కేజ్రీవా ల్ దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం ఢిల్లీ ప్రత్యేక న్యాయస్థానం విచారించింది. ‘షుగర్ లెవల్స్ పెరిగి అనారోగ్యానికి గురైతే బెయిల్ వస్తుందని కేజ్రీవాల్ భావించి చక్కెరలు ఎక్కువుండే ఆహారం తీసుకుం టున్నారు’ అని ఈడీ తరఫు స్పెషల్ పీపీ జోహెబ్ హుస్సేన్ వాదించా రు. ఈ వాదనను కేజ్రీవాల్ తరఫు న్యాయవాది వివేక్ జైన్ తోసిపుచ్చారు. మీడియా అటెన్షన్ కోసమే ఈడీ ఆరోపణలు చేస్తున్నదని చెప్పా రు. జైలులో కేజ్రీవాల్‌కు అమలు చేస్తున్న డైట్ ప్లాన్‌తో పాటు ఆయన మెడికల్ రిపోర్టులు అందజేయాలని జైలు అధికారులను కోర్టు ఆదేశించింది.