ఒడిశాలో కమలం వికసిస్తుంది: అమిత్ షా
21-05-2024 01:59 PM
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల తొలి ఐదు విడతల్లో ఏన్డీయేకు 310కిపైగా స్థానాలు వస్తాయని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. 6,7 విడతల్లో 400కిపైగా స్థానాల లక్ష్యం ప్రధాని నరేంద్ర మోడీ సాధించనున్నారని అమిత్ షా వ్యాఖ్యానించారు. ఒడిశాలో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో కమలం వికసిస్తోందన్నారు. మంగళవారం అమిత్ షా ఒడిశాలో పర్యటించారు. ఈ0 సందర్భంగా సంబల్‌పూర్‌లో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ... లోక్ సభ ఎన్నికల్లో ఐదు విడతల పోలింగ్ ముగిసింది. దేశంలో ఉన్న ఓటర్లకు మోడీకి 400కిపైగా సీట్లు అందించడమే లక్ష్యమన్నారు. కానీ ఒడిశా వాసులకు కేవలం 400 సీట్లు ఏన్డీయేకు ఇవ్వడమే లక్ష్యంకాదు, వాటితో పాటు శాసనసభ ఎన్నికల్లో బీజేపీకి 75కి పైగా స్థానాలు అందించాలని అమిత్ షా ప్రజలను కోరారు.






