24 August, 2026 | 10:19 PM

Breaking News

మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి   •   ఐటీఐలో ఖాళీ సీట్ల భర్తీకి అవకాశం   •   ఆలేరు జెడ్పీహెచ్‌ఎస్‌ విద్యార్థులకు అన్వర్ స్కాలర్‌షిప్   •   ఒంటరి మహిళల సర్టిఫికెట్లకు తిప్పలు!   •   సంగమేశ్వర స్వామివారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •   గణేష్ మాండపాలకు ఉచిత కరెంటు ఇవ్వాలని వినతి   •   చిరుతపులి చర్మం, గోర్లను అక్రమంగా విక్రయించేందుకు ప్రయత్నించిన నలుగురు వ్యక్తులు అరెస్ట్   •   యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి   •   పోచమ్మ దేవత విగ్రహ ప్రతిష్టకు ఆహ్వానం   •   ప్రభుత్వ ఆసుపత్రి డైట్ క్యాంటీన్ ను తనిఖీ చేసిన ఆహార భద్రతా అధికారి జి వరుణ్ రెడ్డి   •  

ఎక్సైజ్ శాఖను మరింత ప్రక్షాళన చేస్తాం: మంత్రి జూపల్లి

21-05-2024 04:34 PM

హైదరాబాద్: గత ప్రభుత్వం చాలా శాఖల్లో బిల్లులు పెట్టింగ్ పెట్టిందని మంత్రి జూపల్లి కృష్ణారావు గాంధీభవన్ లో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో అన్నారు. మద్యం కొరత ఉంటే.. ప్రజలకు నష్టం లేదన్నారు. గతంలో పైరవీలు, ముడుపులు ఉంటే తప్ప.. బదిలీలు జరిగేవి కావని ఆరోపించారు. ఇప్పుడు పైరవీలు, ముడుపులు లేకుండా పోర్టల్ ద్వారా బదిలీలు జరుగుతున్నాయని తెలిపారు. బీఆర్ఎస్ నేతల మాటాలు దొంగే దొంగ అన్నట్లుగా ఉన్నాయని జూపల్లి ఎద్దేవా చేశారు. ఎన్నికల కోడ్ ముగిశాక ఎక్సైజ్ శాఖను మరింత ప్రక్షాళన చేస్తామని ఆయన పేర్కొన్నారు.

కొత్త బ్రాండ్ల కోసం ఎవరూ దరఖాస్తు చేయలేదని, తాము పరిశీలించలేదని మంత్రి తెలిపారు. మద్యం సరఫరాలో బ్లాక్ మార్కెటింగ్ ను పటిష్టంగా నివారిస్తున్నామన్నారు. మద్యం విక్రయాలు తగ్గితే ప్రభుత్వానికే నష్టం.. ప్రజలకు కాదన్నారు. టానిక్ లకు గత ప్రభుత్వం ఇచ్చిన పన్ను మినహాయింపును రద్దు చేశామన్నారు. గత ప్రభుత్వం పదేళ్లపాటు టెండర్లు లేకుండా ఒక్కరికే హోలోగ్రామ్ తయారీని అప్పగించిందని మంత్రి జూపల్లి వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం చేసిన అక్రమాలను ఒక్కోదాన్ని సరిచేసుకుంటూ వెళ్తున్నామని మంత్రి పేర్కొన్నారు.