అండర్ వాటర్ టన్నెల్ డబల్ డెక్కర్ ఎగ్జిబిషన్ లో జలకన్యలు
21-05-2024 08:13 PM
హైదరాబాద్ : కూకట్ పల్లి మెట్రో ట్రక్ పార్కింగ్ వద్ద 'అండర్ వాటర్ టన్నెల్ డబల్ డెక్కర్' ఎగ్జిబిషన్ లో ఏర్పాటు చేశారు. దేశంలోనే మొదటి సారిగా స్కూబా డైవింగ్ తో పాటు స్పెయిన్ నుంచి ప్రత్యేకంగా వచ్చిన జలకన్యలు మెరిశాయి. ఈ మమేడ్ షో ప్రతి రోజు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అందుబాటులో ఉంటుందని నిర్వాహకులు రాజారెడ్డి తెలిపారు. దేశంలోనే మొదటిసారిగా ఏర్పాటు చేసిన ఈ జలకన్యల ప్రదర్శనను సందర్శికులు తమ పిల్లలతోపాటు కలిసి వచ్చి చూసి ఆనందిస్తున్నారని ఆయన వెల్లడించారు.






