కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు
న్యూఢిల్లీ : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టులో ఊరట దక్కలేదు. ఢిల్లీ హైకోర్టు బెయిల్ స్టేను సవాల్ చేస్తూ కేజ్రీవాల్ ఆదివారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సోమవారం కేజ్రీవాల్ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈడీ వేసిన స్టే పిటిషన్ పై ఢిల్లీ హైకోర్టు తుది తీర్పు వెల్లడించిన తరువాతనే విచారణ జరుగుతుందని వెల్లడించింది. హైకోర్టు తీర్పు రాకుండా ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వలేలని తెలిపింది.
దీంతో తదుపరి విచారణను జూన్ 26వ తేదీకి వాయిదా వేసింది. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు కేజ్రీవాల్ కు రెగ్యులర్ బెయిల్ ఇవ్వగా దాన్ని ఈడీ సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టుల ఆ బెయిల్ పై తాత్కాలిక స్టే విధించింది. స్టేను సవాల్ చేస్తూ కేజ్రీవాల్ సుప్రీంకోర్టుకి వెళ్లగా.. హైకోర్టు తీర్పు వచ్చే వరకు వేచి చూడాలని చెప్పింది. లిక్కర్ స్కాం కేసులో మార్చి 21న అరెస్టు అయిన కేజ్రీవాల్ ఇటీవల లోక్ సభ ఎన్నికలకు మధ్యంతర బెయిల్ పై బయటకు వచ్చారు. తర్వాత జూన్ 2న కోర్టులో లొంగిపోయారు.






