30 July, 2026 | 6:15 AM

కేంద్రం అసమర్థత విద్యార్థుల పాలిట శాపం : కేటీఆర్

24-06-2024 05:46 PM

హైదరాబాద్ : నీట్ యూజీ ప్రవేశ పరీక్ష వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వ తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వ నిర్ణయాలకు పొంతన లేకుండా పోయిందన్నారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్ ప్రమాదంలో పడినా కేంద్రం పట్టించుకోకుండా జూలై 6వ తేదీ నుంచి నీట్ కౌన్సెలింగ్ నిర్వహించేందుకు సిద్ధమైందన్నారు. ఎలాంటి కారణాలు చూపకుండా నీట్ - పీజీ పరీక్షను వాయిదా వేశారని కేటీఆర్ దుయ్యబట్టారు. కేంద్రం అసమర్థత విద్యార్థుల పాలిట శాపంగా మారుతోందని మండిపడ్డారు. వీటన్నింటికీ నేషనల్ డిజాస్టర్ అలయన్స్ కారణమని కేటీఆర్ పేర్కొన్నారు.