ఈనెల 5న సిట్ విచారణకు ప్రభాకర్ రావు
హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో(Phone Tapping Case) కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈనెల 5న సిట్ విచారణకు హాజరవుతానని మాజీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (Special Investigation Bureau) చీఫ్ ప్రభాకర్ రావు సమాచారం ఇచ్చారు. సుప్రీంకోర్టు(Supreme Court of India) ఆదేశాలతో ప్రభాకర్ రావు అమెరికా నుంచి తిరిగి వస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు(Prabhakar Rao) నిందితుడిగా ఉన్నారు. విచారణకు సహకరిస్తానంటూ ప్రభాకర్ రావు సుప్రీంకోర్టుకు అండర్ టేకింగ్ లేఖ పంపారు. వన్ టైం ఎంట్రీ పాస్ పోర్టు అందిన వెంటనే భారత్ కు రానున్నట్లు తెలిపారు. పాస్ పోర్టు అందిన మూడ్రోజుల్లో భారత్ కు రావాలని ప్రభాకర్ రావు ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశించింది. ఫోన్ ట్యాపింగ్ నిందితుడు ప్రభాకర్ రావు 14 నెలలుగా అమెరికాలో ఉంటున్నాడు. ప్రభాకర్ రావును విచారిస్తే కేసు కొలిక్కి రావొచ్చని దర్యాప్తు బృందం భావిస్తోంది.






