28 July, 2026 | 1:30 PM

Breaking News

రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసిన కేటీఆర్   •   మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ వేముల వీరేశం   •   తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి వస్తుంది   •   విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలి   •   నూతనంగా నిర్మించిన ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య నిపుణులను కేటాయించండి   •   విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జి.. సెట్ విచారణకు సుప్రీం ఆదేశం   •   లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా   •   పావలా శ్యామల అంత్యక్రియల బాధ్యత తీసుకున్న 'మా' అసోసియేషన్   •   భాగ్యనగర్ తండా సబ్‌స్టేషన్ సమస్య పరిష్కరించాలి   •   విజయ క్రాంతి ఎఫెక్ట్... రైతు వేదిక పరిశుభ్రం   •  

కార్లు, ఇళ్లు చూపించి ఆకర్షిస్తున్నారు.. క్యూనెట్ కేసులో కీలక వ్యక్తులు అరెస్ట్

23-03-2026 04:59 PM

సెకండ్ ఇన్ కమ్ పేరుతో మోసాలు

కార్లు, ఇళ్లు చూపించి క్యూనెట్ లోకి ఆకర్షిస్తున్నారు

హైదరాబాద్: క్యూనెట్ కేసులో కీలక వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు హైదరాబాద్ సీపీ సజ్జనార్(Hyderabad CP Sajjanar) పేర్కొన్నారు. సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో సజ్జనార్ మాట్లాడుతూ... క్యూనెట్ పై తెలంగాణలో 68, హైదరాబాద్ లో 22 కేసులున్నాయని తెలిపారు. ఇటీవల క్యూనెట్ పై మరో 4 కేసులు నమోదయ్యాయి. మూడు రాష్ట్రాల్లో సోదాలు చేసి 32 మందిని అరెస్టు చేశామని సజ్జనార్(Sajjanar) ప్రకటించారు.

అక్టోబర్ లో ఓ క్యూనెట్(QNet case) బాధితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. సెకండ్ ఇన్ కమ్ పేరుతో ఐటీ ఉద్యోగులను ఆకర్షిస్తున్నారు. స్టార్ హోటళ్లలో మీటింగులు పెట్టి ఉత్పత్తులు అమ్మమంటున్నారని తెలిపారు. రుణాలు ఇప్పించి మరీ క్యూనెట్ లో చేర్చుకుంటున్నారని వివరించారు. కార్లు, ఇళ్లు చూపించి క్యూనెట్ లోకి ఆకర్షిస్తున్నారు. బాధితుల్లో ప్రముఖ ఐటీ కంపెనీ ఉద్యోగులున్నారు. మనీలాండరింగ్ పై దర్యాప్తు కోసం ఈడీని కోరతామని సూచించారు.