15-11-2025 03:19:39 PM
హైదరాబాద్: మహిళలు వ్యాపారాల్లో రాణించాలనేది సీఎం రేవంత్ రెడ్డి ఆకాంక్ష అని మంత్రి సీతక్క(Minister Seethakka) అన్నారు. మండల సమాఖ్య అధ్యక్షుల రాష్ట్రస్థాయి సదస్సులో మంత్రి సీతక్క పాల్గొన్నారు. కోటి మంది మహిళలను స్వయంసహాయ సంఘాల్లో చేర్చాలని సూచించారు. మహిళలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో పనిచేస్తున్నామని పేర్కొన్నారు. గృహిణి సంతోషంగా ఉంటేనే కుటుంబమంతా ఆనందంగా ఉంటుందని తెలిపారు. విద్యార్థుల ఏకరూప దుస్తులను మహిళా సంఘాలతోనే కొట్టిస్తున్నామని సీతక్క వివరించారు. ఏటా రూ. 20 వేల కోట్లకు తగ్గకుండా బ్యాంకు రుణాలు ఇప్పిస్తున్నామని తెలిపారు. తీసుకున్న 99 శాతం రుణాలను మహిళా సంఘాలు తిరిగి చెల్లిస్తున్నాయని వెల్లడించారు. మహిళా సంఘాలు ఏకంగా స్త్రీనిధి భ్యాంకు ఏర్పాటు చేసుకున్నాయని తెలిపారు. మహిళ సంఘాలు పెట్రోల్ బంకులు, సోలార్ ప్లాంట్లు, రైల్ మిల్లులు, గిడ్డంగులను నిర్వహిస్తున్నాయని చెప్పారు. ఆదివాసీలు చేసే ఇప్పపువ్వు లడ్డులు అంతర్జాతీయస్థాయికి ఎదిగాయని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. గ్రామీణ మహిళల ఉత్పత్తులకు అంతర్జాతీయస్థాయికి చేరుస్తున్నామని ఆమె తెలిపారు.