11 July, 2026 | 2:08 AM

ధైత కుమార్‌కు కీలక పదవి

11-07-2026 12:00 AM

తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ రాజకీయ కమిటీ కార్యదర్శిగా నియామకం

వేములవాడ, జూలై 10 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ నూ తన కార్యవర్గంలో రాజన్న సిరిసిల్ల జిల్లాకు కీలక ప్రాతినిధ్యం దక్కింది. వేములవాడకు చెందిన ప్రముఖ ఆర్యవైశ్య సంఘం నాయకుడు ధైత కుమార్‌ను మహాసభ రాష్ట్ర ‘రాజ కీయ కమిటీ’ కార్యదర్శిగా నియమిస్తూ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. 2026- 28 పదవీ కాలానికి గాను ఈ నియామకం జరిగింది.

రాబోయే రెండేళ్ల కాలంలో ఆర్యవైశ్య మహాసభ బలోపేతానికి, సంఘీయుల అభ్యున్నతికి నూతన కార్యదర్శి పూర్తి స్థాయి లో సహకరిస్తూ, ఆర్యవైశ్య జాతి ఆర్థిక, సామాజిక, రాజకీయ వైభవానికి, మహాసభ సభ్యత్వ పెంపుదలకు కృషి చేయాలని జిల్లా అధ్యక్షుడు బుస్సా ఆకాంక్షించారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పగించిన ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు అమరవాది లక్ష్మీనారాయణకు, జిల్లా అధ్యక్షులు బుస్సా దశరథంకు సంఘ పెద్దలకు ధైత కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.