11 July, 2026 | 1:55 AM

వేడుకగా ముజీబ్ జన్మదినం

11-07-2026 12:00 AM

హైదరాబాద్, జూలై 10 (విజయక్రాంతి): తెలంగాణ నాన్-గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్, హైదరాబాద్ జిల్లా ఆధ్వర్యంలో డాక్టర్ ఎస్‌ఎం హుస్సేనీ (ముజీబ్) పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించ బడ్డాయి. జిల్లా అధ్యక్షుడు ఎస్ విక్రమ్ కుమార్, కార్యదర్శి కురాడి శ్రీనివాస్ సారథ్యంలో జరిగిన వేడుకల్లో అసోసియేట్ ప్రెసిడెంట్ కె.ఆర్. రాజ్ కుమార్, ఉపాధ్యక్షులు ఖలీద్ అహ్మద్, బి. శంకర్, కార్యవర్గ సభ్యులు జె బలరాజ్, వైదిక శాస్త్ర, ఏ.వి. శ్రీధర్, ముఖీమ్ ఖురేషీ పాల్గొన్నారు.

ఖైరతాబాద్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్, ఈఎస్‌ఐ హాస్పిటల్ నాచారం, గాంధీ, నీలోఫర్ హాస్పిటల్స్ అధ్యక్షుల ఆధ్వర్యంలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. యూసుఫైన్ బాబా దర్గా, ఎం.ఎన్.జె క్యాన్సర్ హాస్పిటల్లోని కనకదుర్గ మాత ఆలయం, నాంపల్లి బంగారు మైసమ్మ ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. జహీరానగర్ వాసులకు అన్నదానం చేశారు. మధ్యాహ్నం టీఎన్జీఓల హైదరాబాద్ జిల్లా కార్యాలయంలో కేక్ కటింగ్ చేశారు.

కార్యక్రమంలో టీఎన్జీఓల కేంద్ర సంఘం అధ్య క్షులు మారం జగదీశ్వర్, కేంద్ర సంఘం ప్రతినిధులు కొండల్‌రెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, శైలజ, రంగారెడ్డి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు యశ్వంత్, శ్రీనివాస్ పాల్గొన్నారు. సాయంత్రం డోన్ బాస్కో అనాథాశ్రమంలో చిన్నారులతో కలిసి కేక్ కట్ చేశారు. వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఉస్మాన్ అలీ ఉస్మానీ, రామకృష్ణ రెడ్డి, మొహమ్మద్ వహీద్, మొహమ్మద్ ముస్తఫా పాల్గొన్నారు.