11 July, 2026 | 2:11 AM

మూసీ ఒడ్డున భారీ అగ్నిప్రమాదం

11-07-2026 12:00 AM

చాదర్‌ఘాట్ సమీపంలో ఘటన

మలక్‌పేట్, జూలై 10 (విజయక్రాంతి): నగరంలోని చాదర్‌ఘాట్ మూసీ ప్రాంతంలో శుక్రవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. డెకరేషన్ గోదాము ల్లో మంటలు చెలరేగి, పక్కనే ఉన్న మోటార్ మెకానిక్, ఇతర వాణిజ్య సంస్థలు మంటల్లో చిక్కుకున్నాయి.

అగ్నిమాపక శాఖ సిబ్బంది ఏడు ఫైరింజన్ల సాయంతో మంటలను అ దుపులోకి తీసుకువచ్చారు. ఎలాంటి ప్రాణనష్టం గానీ, గాయపడిన ఘటనలు గానీ న మోదుకాలేదన్నారు. హైదరాబాద్ జిల్లా అగ్నిమాపక అధికారి వెంకన్న సహాయక చర్యలను పర్యవేక్షింత చారు. మలక్‌పేట ఏసీపీ వెంకట్‌రెడ్డి ఘటన స్థలాన్ని సందర్శించి వివరాలను సేకరించారు.