30 August, 2026 | 10:54 AM

Breaking News

10కే పరుగుకు ఐటీ కారిడార్‌ బలి!   •   అడ్లూరి శ్రీనివాస్‌ను పరామర్శించిన డీఐసీ తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్   •   అభివృద్ధి పనులను పరిశీలించిన ఎంపీ వేం నరేందర్ రెడ్డి   •   ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కల్పించాలి: అదనపు కలెక్టర్ చంద్రయ్య   •   సత్తుపల్లిలో న్యూ జెనెసిస్ హాస్పిటల్ ప్రారంభించిన మంత్రి తుమ్మల   •   నేపాల్-టిబెట్ వరదల్లో ఇప్పటివరకు 682 మంది మృతి   •   చెరువులో అనుమానాస్పదంగా చేపల మృతి   •   పాలేరు జలాశయాన్ని పరిశీలించిన ఎస్ఈ   •   రీ-సర్వే ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్ కుమార్ దీపక్   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని మహిళకు తీవ్రగాయాలు   •  

700 కిలోల కుళ్లిన చికెన్ స్వాధీనం

19-10-2024 12:18 AM

షాప్‌ను సీజ్ చేసిన ఫుడ్ సేఫ్టీ అధికారులు 

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 18 (విజయక్రాంతి): హోటళ్లు, రెస్టారెంట్లకు చికెన్ సరఫరా చేస్తున్న ఓ షాప్‌పై అధికారులు దాడులు చేయగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 700 కిలోల కుళ్లిన చికెన్ స్టాక్ బయటపడింది. వివరాలిలా ఉన్నాయి.. ఫుడ్ సేఫ్టీ, టాస్క్‌ఫోర్స్ అధికారులకు అందిన ఫిర్యాదు మేరకు బేగంపేట ప్రకాశ్ నగర్‌లోని బాలయ్య చికెన్ షాప్‌లో శుక్రవారం దాడులు నిర్వహించారు.

సుమారు 700 కిలోల చికెన్‌ను నెల రోజులకు పైగా ఫ్రిజ్‌లో ఉంచినట్టుగా అధికారులు గుర్తించారు. కుళ్లిన చికెన్, కొవ్వు పదార్థాలకు కెమికల్స్ వేసి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లకు, పలు మద్యం దుకాణాలు, బార్ అండ్ రెస్టారెంట్లకు సరఫరా చేస్తున్నట్టుగా నిర్ధారణకు వచ్చారు. కుళ్లిపోయిన చికెన్‌తో పాటు కొవ్వు పదార్థాల శాంపిళ్లు తీసుకున్నట్టు ఫుడ్ సేఫ్టీ అధికారి మారుతి తెలిపారు. ఇంకా ఇలాంటి చికెన్ షాపులు నగరంలో ఎన్ని ఉన్నాయనే విషయాన్ని పరిశీలిస్తున్నట్టు వెల్లడించారు.