20 April, 2026 | 3:27 AM

ఖమేనీ అంత్యక్రియలు మరింత జాప్యం

20-04-2026 01:43 AM

ఏడు వారాలు గడిచినా నిరీక్షణే

టెహ్రాన్, ఏప్రిల్ 19: ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ చనిపోయి ఏడు వారాలు గడిచినా, ఆయన అంత్యక్రియల విషయంలో సందిగ్ధతే నెలకొంది. కొత్త ప్రభుత్వం ఇప్పటికీ ఈ విషయంలో ఎలాంటి ముందడుగు వేయలేకపోతున్నది. భద్రతా పరమైన కారణాలు, యుద్ధ వాతావరణం, దేశంలో అస్థిరత తలెత్తే ముప్పు ఉండటంతోనే అధికారిక అంత్యక్రియలు ఆలస్యమవుతున్నాయని అధికారిక వర్గాల సమాచారం. ఖమేనీ ఫిబ్రవరి 28న అమెరికా జరిపిన ఉమ్మడి వైమానిక దాడిలో మరణించారు.

సాధారణంగా ఇస్లామిక్ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు సత్వరం పూర్తి చేయాల్సి ఉన్నా, ప్రస్తుత యుద్ధ పరిస్థితుల్లో ఇరాన్ వెనుకడుగు వేస్తోంది. భారీ స్థాయిలో ప్రజలు గుమిగూడినప్పుడు ఇజ్రాయెల్ మరోసారి దాడులకు పాల్పడే అవకాశం ఉందని ఆ ప్రభుత్వం అనుమానిస్తున్నది. అత్యక్రియల సమయం లో అంతర్గతంగా నిరసనలు వెల్లువెత్తే ప్ర మాదమూ ఉందని భయపడుతున్నది. ఈ నేపథ్యంలో ఖమేనీ అంతిమయాత్ర ఎప్పు డు జరుగుతుందనేది ప్రశ్నార్థకంగానే మిగిలింది.