20 April, 2026 | 3:27 AM

నీ శారీరక అవసరాలు తీరుస్తాం!

20-04-2026 01:41 AM

నాసిక్ టీసీఎస్‌లో ఓ బాధితురాలికి నిందితుల వేధింపులు

విచారణలో వెలుగు చూస్తున్న మరిన్ని దారుణాలు

ముంబై, ఏప్రిల్ 19: శారీరక అవసరాలు తీరుస్తామంటూ నాసిక్ టీసీఎస్‌లో ఓ బాధితురాలిని నిందితులు తీవ్రంగా వేధించారు. ఆదివారం బాధితురాలి విచారణలో మరిన్ని దారుణాలు వెలుగులోకి వచ్చాయి. బాధితురాలు తన గోడు వెళ్లబోసుకుంటూ అధికా రుల వద్ద కన్నీటి పర్యంతమైంది. నిందితుల అకృత్యాలను అధికారులకు వెల్లడించింది.

భర్తలేని సమయంలో ఒంటరిగా ఎలా ఉంటున్నావని నిందితులు వేధించేవారని, ఏ అవసరం ఉన్నా తీర్చేందుకు తాము సిద్ధమని అసభ్యంగా మాట్లాడేవారని తెలిపింది. తనను వెంబడిస్తూ తాకాలని, రకరకాల అసభ్యకరమైన పేర్లతో పిలిచేవారని, పక్కన వచ్చి కూర్చొని అసభ్యంగా ప్రవర్తించేవారని తెలిపింది. 

తనతో రావాలని ఆసిఫ్ అన్సారీ ఒత్తిడి తెచ్చేవాడని ఆవేదన వ్యక్తం చేసింది. శారీరక అవసరాలు తీరుస్తానంటే వ్యాఖ్యలు చేయడం తనను తీవ్రంగా కలచివేశాయని బాధితురాలు అధికారులకు వివరించింది. బుర్ఖా వేసుకోకపోవడం వల్లే మీ మతంలో అత్యాచారాలు జరుగుతాయని, హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ తన మనోభావాలను దెబ్బతీశాడని పేర్కొంది. తన వేశాధారణపై కూడా అసభ్యంగా మాట్లాడేవాడని తెలిపింది. ఉద్యోగం పోతుందనే భయంతో ఇన్నాళ్లు భరించానని ప్రవర్తన రోజురోజుకూ శ్రుతిమించిందని బాధితురాలు తెలిపింది. షారుఖ్ ఖురేషి, రజా మేమన్, ఆసిఫ్ అన్సారీ, తౌసిఫ్ అత్తర్, షఫీ షేక్ అనే ఐదుగురు తనను నిరంతరం వేధిస్తూ నరకం చూపించారని వాపోయింది.