ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక వాయిదా
హైదరాబాద్: నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక(Khanapur Municipal Chairman Election Postponed) వాయిదా పడింది. దీంతో మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక నిర్వహణపై సందిగ్ధత నెలకొంది. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు. మున్సిపల్ కార్యాలయం ముందు బీజేపీ, బీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు.
ఎమ్మెల్యే బొజ్జుకు(Congress MLA Vedma Bojju) వ్యతిరేకంగా బీజేపీ, బీఆర్ఎస్ కౌన్సిలర్లు నినాదాలు చేశారు. ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో కాంగ్రెస్ ఎమ్మెల్యే దౌర్జన్యం చేశారని బీజేపీ, బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. ఆల్ఫాబెటిక్ ఆర్డర్ ప్రకారం బీజేపీ కౌన్సిలర్ అంకం మౌనిక పేరు పిలవడంతో ఆమెకు ఏడుగురు కౌన్సిలర్లు మద్దతు తెలుపుతూ చేతులెత్తారు. దీంతో ఆగ్రహించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే బొజ్జు ముందు కాంగ్రెస్ అభ్యర్థి చిన్నం సత్యం పేరు పిలవాలని పోడియం వద్ద ఉన్న అధికారుల మీదికి దూసుకెళ్లడంతో పాటు వారితో వాగ్వాదానికి దిగారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది.




