4 April, 2026 | 5:51 PM

CID విచారణకు హాజరైన BRS ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి

04-04-2026 04:14 PM

హైదరాబాద్: హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి(BRS MLA Kaushik Reddy) ఆయన భార్య సతీమణి శాలిని రెడ్డితో పాటు వీణవంక సమ్మక్క సారలమ్మ జాతరలో జరిగిన ఘటన కేసులో లక్డీకాపూల్‌లోని CID కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. సమ్మక్క సారక్క ఆలయంలో జరిగిన ఘటనకు సంబంధించి ఆయనపై దాఖలైన కేసుకు సంబంధించి సీఐడీ ఆయనకు నోటీసులు ​​జారీ చేసింది. జనవరిలో జరిగిన సమ్మక్క-సారలమ్మ జాతర(Sammakka Saralamma Jatara) సందర్భంగా చట్టవిరుద్ధంగా సమావేశమై పోలీసు సిబ్బందిని అడ్డుకున్నారనే ఆరోపణలున్నాయి. వీనవంక మండలంలో జరిగిన మేడారం (సమ్మక్క-సారక్క) జాతర సందర్భంగా, జనవరి 29న ఎమ్మెల్యేకు, విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందికి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది.

శాంతిభద్రతల సమస్యలను కారణంగా చూపుతూ, ఉత్సవ స్థలం వైపు కౌశిక్ రెడ్డిని వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఈ ఘర్షణ సమయంలో కౌశిక్ రెడ్డి ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించేలా ధర్నాకు దిగాడని, కమిషనర్‌పై అభ్యంతరకరమైన భాషను ఉపయోగించాడని ఆరోపణలున్నాయి. ఈ ఘటనలపై హుజురాబాద్ పోలీసు స్టేషన్‌లో(Huzurabad Police Station) కేసు నమోదైంది. కాగా, రాష్ట్ర ప్రభుత్వం కేసును సీఐడీకి బదిలీ చేసింది. భారతీయ నాగరిక సురక్షా సంహితలోని సెక్షన్ 35(3) కింద ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి సమన్లు ​​జారీ చేశారు. సాక్ష్యాలను తారుమారు చేయవద్దని ఆ నోటీసుల్లో సీఐడీ హెచ్చరించింది.