రామోజీరావుకు తీవ్ర అస్వస్థత
08-06-2024 02:16 AM
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 7 (విజయక్రాంతి) : ఈనాడు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు శుక్రవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను కుటుంబసభ్యులు నానక్‌రాంగూడలోని స్టార్ హాస్పిటల్‌కు తరలించారు. ప్రస్తుతం వెంటిలే టర్‌పై చికిత్స అందిస్తున్నారు. ఇటీవల గుండెకు సంబంధించి ఆయనకు స్టంట్ వేశారు. కొద్దికాలం పాటు ఆరోగ్యంగా ఉన్న రామోజీరావు మళ్లీ అనా రోగ్యం పాలయ్యారు. కొద్ది గంటలు గడిస్తే గానీ ఏం చెప్పలేం అని వైద్యు లు వెల్లడించినట్లు సమాచారం.






