6 June, 2026 | 9:55 PM

Breaking News

విద్యుత్ పెన్షనర్లపై ‘ఐఏఎస్’ కక్షసాధింపు.. సీఎం రేవంత్ రెడ్డి మాటలకు తూట్లు!   •   కామారెడ్డి జిల్లాలో అంతర్ జిల్లా వాహనాల చోరీ ముఠా అరెస్ట్   •   పంచభూతాలను కలుషితం చేస్తున్న డంపింగ్ యార్డ్ ఎత్తివేతే లక్ష్యంగా పోరాటం   •   పెట్రోలింగ్, బ్లూ కోల్డ్స్ వాహనాలతో సంచరిస్తూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలి   •   ఆకట్టుకున్న చిన్నారుల కూచిపూడి నృత్యాలు   •   బావుసాయిపేటలో ఉచిత వైద్య శిబిరం   •   దేశ నిర్మాణంలో కార్మికుల పాత్ర ఎంతో గొప్పది : ఎంపీ ఈటల రాజేందర్   •   సమస్యల పరిష్కార సాధనకే గ్రామసభలు   •   సర్కారు భూముల పరిరక్షణే ధ్యేయం   •   రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు   •  

పొద్దున కిడ్నాప్..సాయంత్రం రిలీజ్

06-11-2024 01:29 AM

తిరుమలాపూర్‌లో బాలిక కిడ్నాప్ కథ సుఖాంతం

చాక్లెట్ ఆశచూపి కారులో ఎక్కించుకెళ్లిన దుండగులు

సాయంత్రం వరకు తిప్పి గ్రామశివారులో వదిలివెళ్లిన వైనం

దౌల్తాబాద్, నవంబర్ 5: చాక్లెట్ ఆశచూపి బాలికను కిడ్నాప్ చేసి.. చివరకు గ్రామశివారులో వదిలివెళ్లిన సంఘటన సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం తిరుమల పూర్‌లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాలిక తల్లిదండ్రులు తెలిపిన వివరాల ప్రకారం... తిరుమలాపూర్‌లోని బుడగజంగాలకు చెందిన లక్ష్మి,రాములు దంపతుల కుమార్తె పల్లవి ఆదివారం ఉదయం 11:30 గంటల సమయంలో నోట్‌బుక్ కోసం అదే గ్రామంలోని తన స్నేహితురాలి ఇంటికి వెళ్తుండగా కారులో వచ్చిన గుర్తుతెలియని దుండగులు చాక్లెట్ ఇస్తామని చెప్పి కారులో ఎక్కించుకున్నారు. బాలిక ఏడవడంతో కొంతదూరం వెళ్లాక కారులోంచి డిక్కీలో బంధించారు.

సాయంత్రం వరకు వివిధ ప్రాంతాల్లో తిప్పి చివరకు బాలికను సాయంత్రం 4 గంటల ప్రాంతంలో గ్రామ శివారులో వదిలి వెళ్లిపోయారు. పల్లవి ఇంటికి వెళ్లి తల్లిదండ్రులకు జరిగిన విషయం చెప్పిడంతో వారు అదేరోజు దౌల్తాబాద్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ విషయమై ఎస్‌ఐ శ్రీరాం ప్రేమ్‌దీప్‌ను వివరణ కోరగా గ్రామంలో పర్యటించి బాలిక చెప్పిన స్థలాలను, ఆనావాళ్లను రికార్డు చేశామన్నారు. గ్రామంలోని సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. అయితే బాధితులు రాతపూర్వకంగా ఫిర్యాదు ఇవ్వకపోవడం వల్ల తాము కేసు నమోదు చేయలేదన్నారు.