రాజు బాజేవాలా ముస్తాబు
11-03-2026 01:22 AM
ప్రముఖ సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ బాలీవుడ్‌లో ఒక సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ‘రాజు బాజేవాలా’ పేరుతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో ‘చిన్నారి పెళ్లికూతురు’ ఫేమ్ అవికా గోర్, ‘పంచాయత్’ సిరీస్ నటుడు చందన్‌రాయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. బ్రిజేంద్ర కాలా కీలక పాత్రలో కనిపించనున్నారు. పెళ్లిళ్లలో బ్యాండ్ వాయించే వారి జీవితం చుట్టూ ఈ కథ సాగుతుంది.
ఇప్పటివరకు తెరపై పెద్దగా కనిపించని వారి కథను పలాష్ ముచ్చల్ ఈ సినిమా ద్వారా చూపిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో పూర్తయింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంగీతకారులందరికీ సంగీత నివాళిగా ఈ సినిమాను రూపొందిస్తున్నారు పలాష్ ముచ్చల్. అమన్‌గుప్తా నిర్మించిన ఈ సినిమా నేరుగా ఓటీటీ వేదికగా విడుదల కానుంది.




