23 June, 2026 | 7:52 PM

Breaking News

పాఠ్యపుస్తకాల పేరిట దోపిడీని అరికట్టాలి: ఏఐవైఎఫ్ హెచ్చరిక   •   నెల రోజులు ఇంటింటి సర్వే...   •   రైతుల ఖాతాల్లో ధాన్యం డబ్బులు వెంటనే జమ చేయాలి   •   కల్లూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మత్తు పదార్థాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం   •   ఫాదర్ అమల్ ఫ్రాన్సిస్ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం   •   మూతపడిన ప్రభుత్వ పాఠశాల ప్రారంభానికి ముహూర్తం ఖరారు   •   విబిజీ రాంజీ విధానాన్ని రద్దుచేసి 'ఎన్ఆర్ఈజీఎస్'ను పునరుద్ధరించాలి   •   చంద్‌నగర్ ప్రాథమిక పాఠశాలకు ఆర్వో ప్లాంట్ అందజేసిన సర్పంచ్ సింగం శ్రీహరి   •   పదవ తరగతిలో ఉత్తీర్ణులైన విద్యార్థులకు సన్మానం   •   వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు, పంట మార్పిడి, విత్తన ఎంపికతో అధిక దిగుబడులు   •  

ఆర్య 40తో స్టార్‌డమ్ వర్కౌట్!

11-03-2026 01:24 AM

టాలీవుడ్ బ్యూటీ వైష్ణవి చైతన్య తన కెరీర్‌లో మరో ముందడుగులు వేసింది. చిన్న పాత్రలు చేస్తూ ‘బేబీ’ సినిమాలో హీరోయిన్‌గా ఒక్కసారిగా చిత్రసీమను ఊపే సిన ఈ ముద్దుగుమ్మ ఇక కోలీవుడ్‌లో పాగా వేసేందుకు సిద్ధమైంది. తెలుగులో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న వైష్ణవి ఇప్పుడు ఏకంగా తమిళ స్టార్ హీరో ఆర్య సరసన నటించే బంపర్ ఆఫర్ కొ ట్టేసింది.

తమిళ స్టార్ హీరో ఆర్య కెరీర్‌లో 40వ మైలురాయిగా ఓ సిని మా రూపొందుతోంది. ‘ఆర్య-40’గా ప్రచారంలో ఉన్న ఈ చిత్రంలో వైష్ణవిచైతన్య కథానాయికగా ఎంపికైంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన ఇన్‌స్టా వేదికగా వెల్లడిస్తూ అందరినీ ఆశ్చర్యపరిచింది. జిమ్ హీరో ఆర్యతో కలిసి వర్కవుట్స్ చేస్తున్న ఫొటోను షేర్ చేస్తూ ‘ఆర్య-40 లోడింగ్.. పని జరుగుతోంది’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది వైష్ణవి.

తెలుగులో మాంచి ఫేమ్ రాబట్టుకున్న వైష్ణవి.. ఇప్పుడు తమిళనాట కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. ఆర్య వంటి మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరోతో జోడీ కట్టడం వైష్ణవి కెరీర్‌కు బాగా కలిసి వస్తుందని అభిమానులు భావిస్తున్నారు.