calender_icon.png 7 February, 2026 | 10:11 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేసీఆర్‌కు కిషన్‌రెడ్డి.. దత్తపుత్రుడే!

07-02-2026 02:08:08 AM

కల్వకుంట్ల కిషన్‌రావుగా మారారు..

కేసీఆర్ అరెస్ట్ ఎప్పుడో చెప్పాలి?

  1. కేసీఆర్‌ను కాపాడుతున్నారు.. 
  2. ఓటు అడిగే నైతిక హక్కు బీజేపీకి లేదు 
  3. మున్సిపాలిటీలకిచ్చిన నిధులు ఖర్చు చేయని బీఆర్‌ఎస్
  4. నిజామాబాద్ సభలో సీఎం రేవంత్‌రెడ్డి

నిజామాబాద్, ఫిబ్రవరి 6 (విజయక్రాంతి): బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, హరీశ్‌రావును చర్లపల్లి జైల్లో పెట్టకుండా అడ్డుకుంటున్నది ఎవరో అందరికీ తెలుసని, కేసీఆర్‌ను కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఏ రకంగా కాపాడుతున్నాడో తెలియడంలేదా? అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. శాసనసభలో చర్చ పెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోవడాన్ని సీబీఐకి అప్పగించినప్పటికీని బీజేపీ ఇప్పటివరకు దానిని పట్టించుకోవడంలేదని, కిషన్‌రెడ్డి ఏ బొక్కలో దాక్కున్నాడని ఆయన నిలదీశారు.

నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం బర్దిపూర్ గ్రామంలో శుక్రవారం ‘ప్రజా పాలన ప్రగతి బాట’ బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. కిషన్‌రెడ్డి.. కేసీఆర్‌కు దత్తపుత్రుడిలా వ్యవహ రిస్తున్నారని సీఎం ఆరోపించారు. కేసీఆర్‌కు కేటీఆర్ దొంగ పుత్రుడైతే, కిషన్‌రెడ్డి దత్తపుత్రుడని.. అందుకే కేసీఆర్ ఫ్యామిలీ జైలుకు పోకుండా ఆయనే కాపాడుతున్నాడని ధ్వజమెత్తారు.  నిజానికి ఆయన కిషన్‌రెడ్డి కాదు.. కల్వకుంట్ల కిషన్‌రావు అని ఎద్దేవా చేశారు.

కేసీఆర్, హరీశ్‌రావును జైల్లో పెట్టి చిప్పకూడు తినిపించాలని ఎంపీ ధర్మపురి అర్వింద్ అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కేసిఆర్, హరీశ్‌రావును ఎప్పుడు అరెస్ట్ చేస్తారో బీజేపీ నాయకులు చెప్పాలని సీఎం ప్రశ్నించారు. ఎంపీ అర్వింద్‌కు పరపతిలేదని, ప్రధాని మోదీ దగ్గర ఆయన మాట చెల్లదని.. ఒకవేళ అర్వింద్‌కు సత్తా ఉంటే నిజామాబాద్‌ను స్మార్ట్ సిటీ ఎందుకు చేయలేదని సీఎం ప్రశ్నించారు. మూడుసార్లు మోదీ ప్రధానమంత్రి అయినా నిజామాబాద్ స్మార్ట్ సిటీ సాధించలేకపోయారని అన్నారు.

నిజామామాద్‌కు ఎయిర్‌పోర్ట్ ఎందుకు తీసుకురావడం లేదని ప్రశ్నించారు. నిజామాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుకు నిధులు ఇస్తే తాము వద్దన్నామా ఆని ఆయన ప్రశ్నించారు. నిజామాబాద్ జిల్లాకి ఏం నిధులు తెచ్చారని బీజేపీ నాయకులు ప్రజలను ఓట్లు అడుగుతున్నారని రేవంత్‌రెడ్డి అన్నారు. నిజామాబాద్ రైతుల ఆత్మగౌరవంతో పంటలు పండించుకుంటున్నారంటే, అది కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టుల వల్లనే అన్నారు. నిజాంసాగర్, ఎస్‌స్సారెస్పీ ప్రాజెక్ట్‌లు కాంగ్రెస్ హయాంలో కట్టినవే.. అని ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయని రేవంత్‌రెడ్డి తెలిపారు.

బీఆర్‌ఎస్ ప్రభుత్వం కట్టించిన కాళేశ్వరం కాస్తా కులేశ్వరంగా మారిందని, కాళేశ్వరం పేరుతో లక్ష కోట్లు రూపాయలు గోదావరిపాలు అయ్యాయని రేవంత్‌రెడ్డి అన్నారు. బీఆర్‌ఎస్ అవినీతి వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందన్నారు. నిజామాబాద్ కార్పొరేషన్‌తో పాటు ఏడు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా ఎగరబోతుందని ఆయన చెప్పారు. బీజేపీ, బీఆర్‌ఎస్ పాలనలో నిజామాబాద్ చెతకుప్పగా మారిందని, సమస్యలు మరింత జటిలమయ్యాయని, నిజామాబాద్ వీధుల్లో మురికి కాలువలు శుభ్రం చేయాలంటే సాధ్యపడటం లేదని అన్నారు.

గల్లీలో మోరీ తీయాలంటే ఢిల్లీకి వెళ్లి మోదీని అడగాలా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా బీఆర్‌ఎస్ నాయకులు అభివృద్ధిని అడ్డుకున్నారన్నారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీలో 1,045 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామన్నారు. నిజామాబాద్ జిల్లాను అన్నిరకాలుగా అభివృద్ధి పరిచే బాధ్యత తనదే అని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. గతంలో మున్సిపాలిటీల్లో 90 శాతం బీఆర్‌ఎస్ పార్టీ ప్రతినిధులు ఉన్నారని, వారు అభివృద్ధిని అడ్డుకున్నారని అన్నారు.

అందుకే అభివృద్ధి కోసం మనవారిని ఎన్నుకోవాలని సీఎం కోరారు. నిజామాబాద్ జిల్లాను ఒక చెత్తకుప్పగా బీఆర్‌ఎస్ ప్రభుత్వం మార్చిందని, నయాపైసా ఉపయోగం లేని బీజేపీని రాష్ట్రంలో బొంద పెట్టాలని సీఎం పిలుపునిచ్చారు. 8 ఎంపీ సీట్లిస్తే.. ఇద్దరు కేంద్రమంత్రులను చేసుకున్నారని, వారితో ఇంతవరకు నయాపైసా లాభం తెలంగాణకు చేకూరలేదన్నారు. తను అన్ని కులాలకు, మతాలకు అండగా ఉంటున్నానని, వారి సంక్షేమానికి కట్టుబడి ఉండి వారి ఆదరాభిమానాలు చూరగొంటున్నానన్నారు.

అందుకే తను అందరివాడన య్యానని పేర్కొన్నారు. గౌడ్‌లలో గౌడులా, ముదిరాజులలో ముదిరాజులా, మాదిగలో మాదిగలా, ముస్లింలలో ముస్లింలా కలిసిపోయి వారంతా తనను సొంత మనిషిలా అక్కున చేర్చుకోవడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రాంచంద ర్‌రావు తనను ముస్లిం పేరుతో పిలిచినా తనకు ఆనందమేనని సీఎం అన్నారు. తెలంగాణను నెంబర్‌వన్ రాష్ట్రం గా తయారుచేసే బాధ్యత తమ ప్రభుత్వంపై ఉందన్నారు.

పదేళ్లలో ఒక రేషన్ కార్డు ఇవ్వలేదని, తమ ప్రభుత్వం లక్షలాది రేషన్ కార్డులు ఇచ్చిందని.. 3.10 కోట్ల మందికి సన్నబియ్యం ఇస్తున్నామన్నారు. పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ 50 లక్షల కుటుంబాలకు ఇస్తున్నామని, 500 రూపాయలకే 50 లక్షల కుటుంబాలకు సిలిండర్లను ఇస్తున్నామన్నారు. ఆర్టీసీలో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం కల్పించడానికి తొమ్మిది వేల కోట్ల రూపాయలను చెల్లించామని చెప్పారు.

వరి రైతులకు రూ.500 బోనస్ అమలు చేస్తున్నామన్నారు. ఈ సభలో రేవంత్‌రెడ్డితో పాటు మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ సలహాదారులు సుదర్శన్‌రెడ్డి, షబ్బీర్ అలీ, హర్కార వేణుగోపాల్, నిజామాబాద్ రూరల్ ఎమ్మె ల్యే భూపతిరెడ్డి, ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్, పార్టీ సీనియర్ నాయకులు తాహెర్ బిన్ హందాన్, మాజీ ఎమ్మెల్యే మండవ వెంకటేశ్వరరావు, గడుగు గంగాధర్, డీసీసీ అధ్యక్షులు నగేష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత హాజరయ్యారు.

అభివృద్ధి పనులకు నిధులివ్వండి

సీఎం రేవంత్‌రెడ్డికి ఎమ్మెల్యే భూపతిరెడ్డి వినతి

నిజామాబాద్ జిల్లాలో అమలు కాకుండా ఉన్న పలు అభివృద్ధి పనులకు మంజూరు ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి వినతి పత్రం సమర్పించారు. బీఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్యాకేజ్ నెంబర్ 21, 22 (ఏ ) తోపాటు నిజామా బాద్ రూరల్ నియోజకవర్గంలోని గుత్ప లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ జక్రాన్ పల్లి ఆర్మూర్ మండలాల్లో పూర్తి చేయడంతో లక్ష 20 వేల ఎకరాలకు ప్రయోజనం ఉంటుందని ఎమ్మెల్యే భూపతిరెడ్డి సీఎంతో పేర్కొ న్నారు.

ఆగ్రో ఇండస్ట్రీ కోసం మల్కాపూర్ గ్రామంలోని శాస్త్రినగర్‌లో స్థలం గుర్తించా మని, వ్యవసాయ ఆధారిత పరిశ్రమల అభివృద్ధికై వెంటనే మంజూరు ఇవ్వాలని రేవంత్‌రెడ్డిని ఎమ్మెల్యే భూపతిరెడ్డి కోరా రు. తెలంగాణ యూనివర్సిటీ పరి ధిలో యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీ రిం గ్‌తో పాటు అదనపు కోర్సులను ఏర్పా టు చేయాలని, ముఖ్యమంత్రికి ఇచ్చిన విజ్ఞాపన పత్రంలో పేర్కొన్నారు. నిజామా బాద్ ఔటర్ రింగ్ రోడ్డు పనులు వేగవం తం చేయాలని నగరంలోని మాస్టర్ ప్లాన్ అమలు తోపాటు నిజామాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ పరిధిలోని అభి వృద్ధి పనులకై మంజూరు ఇవ్వాలని కోరారు.

నిజామాబాద్ అర్బన్ నిజామా బాద్ రూరల్ ,ఆర్మూర్, బోధన్‌లో స్పోర ట్స్ కాంప్లెక్స్ కోసం సీఎంను అభ్యర్థిం చారు. నిజామాబాద్ మోపాల్ ఇంద ల్వాయి ఇంటిగ్రేటెడ్ మండల కార్యాల యాల కాంప్లెక్స్ బిల్డింగ్‌ల స్థల సేకరణ జరిగినప్పటికిని పెండింగ్‌లో ఉన్నట్టు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. తుంపల్లి కొండూరు సిరికొండ నర్సింపల్లి గన్నారం సిర్నాపల్లి రేకులపల్లి ముత్తకుంట గ్రామా ల్లో హై లెవెల్ బ్రిడ్జ్‌ల నిర్మాణానికి అను మతి ఇవ్వాలన్నారు.

ఇందల్వాయి నుంచి వేములవాడ కమ్మర్పల్లి మాచారెడ్డి నాలు గు లైన్ల రోడ్డు , జాతీయ రహదారి ఇంద ల్వాయి టోల్ ప్లాజా అతిథి గృహంతో పాటు డిచ్ పల్లి లో వంద పడకల స్త్రీ శిశు ఆస్పత్రిని, ట్రామా కేర్ సెంటర్ మంజూరు ఇవ్వాలని ముఖ్యమంత్రికి ఇచ్చిన వినతిప త్రంలో కోరారు. జాతీయ రహదారి 44 ఆనుకుని ఉన్న డిచ్ పల్లి కిల్లా రామాల యం చారిత్రక గుర్తింపు ప్రాంతాన్ని టూరి జంగా అభివృద్ధికి మంజూరు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని భూపతిరెడ్డి కోరారు.