17 April, 2026 | 12:07 PM

Breaking News

హరివంశ్ రాజ్యసభ ఉపసభాపతిగా ఏకగ్రీవం   •   ఏడేళ్లుగా డిప్యూటీ స్పీకర్ పదవి ఖాళీగా ఉంచడంలో అర్థమేంటీ?   •   హన్మకొండ జిల్లా అక్రిడిటేషన్ కమిటీ ఖరారు   •   ఉపాధి హామీ కూలీలకు త్రాగునీటి ఇబ్బంది లేకుండా చూడండి   •   కీలక బిల్లులపై సర్వత్రా ఉత్కంఠ! లోక్‌సభలో 4 గంటలకు ఓటింగ్   •   రేవంత్ రెడ్డి హైబ్రిడ్ ఫార్ములా కాదు.. అది అసదుద్దీన్ ఓవైసీ ఫార్ములా   •   సోనాల మండల కేంద్రంలో నిఘా నేత్రాల ఏర్పాటు   •   డిల్లీ లో వేం నరేందర్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే జారె   •   రోడ్డు భద్రతా ప్రమాణాలపై ఐజీ చంద్రశేఖర్ రెడ్డితో సమావేశం   •   వృద్ధుల కోసం వైద్య సేవలు అందించడం ఎంతో అవసరం   •  

రేవంత్ రెడ్డి హైబ్రిడ్ ఫార్ములా కాదు.. అది అసదుద్దీన్ ఓవైసీ ఫార్ములా

17-04-2026 10:55 AM
  1. డీలిమిటేషన్ తో దక్షిణ భారత్ కు సీట్లు తగ్గవు
  2. మహిళల రిజర్వేషన్లకు ఎంఐఎం వ్యతిరేకం
  3. డీలిమిటేషన్ పై బీఆర్ఎస్, కాంగ్రెస్ అవాస్తవాలు

హైదరాబాద్: దక్షిణ భారత్(South India)కు సీట్లు తగ్గకుండా డీలిమిటేషన్(Delimitation) జరుగుతోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy) హామీ ఇచ్చారు. న్యూఢిల్లీ అశోక రోడ్డులో నిర్వహించిన మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ... కొత్త నాయకత్వానికి అవకాశం వస్తుందని ఆవేదనతో డీలిమిటేషన్ ను వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. డీలిమిటేషన్ పై కాంగ్రెస్, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని కిషన్ రెడ్డి(Kishan Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి హైడ్రిడ్ ఫార్ములా(Revanth Reddy's Hybrid Formula) కాదు.. అది అసదుద్దీన్ ఓవైసీ(Asaduddin Owaisi) ఫార్ములా అన్నారు.

మహిళల రిజర్వేషన్లకు ఎంఐఎం పార్టీ వ్యతిరేకమని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఆర్థికంగా, రాజకీయంగా మహిళలకు హక్కులు ఉండకూడదని ఆలోచించే పార్టీ ఎంఐఎం అన్నారు. గత 30 సంవత్సరాలుగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఎంఐఎం నుంచి గెలిచిన మహిళ కార్పొరేటర్లుకు ఎంఐఎం పార్టీ అధికారాలు ఇవ్వదని, వారిని వంటగదికే పరిమితం చేస్తున్నారని ద్వజమెత్తారు. అలాంటి పార్టీలకు బీఆర్ఎస్, కాంగ్రెస్ వత్తాసు పలుకుతున్నారని ఫైర్ అయ్యారు. ఎంఐఎం నేతలు మహిళలను పిల్లలను కనే మిషన్లుగా తయారు చేశారని, ఎంఐఎంకు మద్దతుగా జనాభా పెంచుతున్నారని ఆరోపించారు.