17 April, 2026 | 2:46 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

కేకే కుమారుడికి బెదిరింపులు

08-02-2026 01:42 AM
  1. భూవివాదంలో డబ్బు డిమాండ్
  2. ఇద్దరిపై కేసు నమోదు

హైదరాబాద్, సిటీ బ్యూరో ఫిబ్రవరి 07 (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు(కేకే) కుమారుడు కె.వెంకటేశ్వరరావుకు బెదిరింపులు ఎదురయ్యాయి. నివాస స్థలాల విష యంలో తనను బెదిరిస్తూ, భారీగా డబ్బులు డిమాండ్ చేస్తున్నారంటూ ఆయన బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించారు.

ఈ మేరకు సిద్దిపేట జిల్లా కొండపాకకు చెందిన గడీల రఘువీర్‌రెడ్డితో పాటు అన్వేష్‌రెడ్డిపై ఆయన ఫిర్యాదు చేశారు. వెంకటేశ్వరరావు ఫిర్యాదు ప్రకారం.. కొంతకాలంగా నివాస స్థలాల విషయంలో నిందితులతో వివాదం నడుస్తోంది. ఫిర్యాదును స్వీకరించిన బంజారాహిల్స్ పోలీసులు.. రఘువీర్‌రెడ్డి, అన్వేష్ రెడ్డిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కేసును దర్యాప్తు చేస్తున్నారు.