ప్లేస్మెంట్స్‌లో కేఎల్ వర్సిటీ రికార్డు
విద్యార్థికి రూ.81 లక్షల ప్యాకేజీ
హైదరాబాద్, ఏప్రిల్ 2 (విజయక్రాంతి): ఈ నెల 4వ తేదీన హైదరాబాద్‌లో, 11వ తే దీన విజయవాడ క్యాంపస్‌లో కెఎల్ యూనివర్సిటీ విద్యార్థులు ఘనమైన రికార్డులు సా ధించారు. నెక్స్ పర్ట్ కంపెనీలో రూ.81 లక్షల వార్షిక ప్యాకేజీని విద్యార్థి సాధించాడు. వివి ధ జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు నిర్వహించిన ప్లేసెమెంట్స్ డ్రైవ్‌లో 52 లక్షలు, 44, 40, 34 లక్షల రూపాయల వార్షిక ప్యా కేజీలను సాధించినట్లు యూనివర్సిటీ వైస్ ఛాన్సెలర్ డాక్టర్ పార్ధసారధి వర్మ తెలిపారు.
150 మంది విద్యార్థులు 25 లక్షలు, 630 మంది విద్యార్థులు 15 లక్షల రూపాయల వార్షిక ప్యాకేజీలను దక్కించుకున్నారని పేర్కొన్నారు. గూగుల్, హితాచి, తోషిబా, అమెజాన్, సర్వీస్ నౌ, జె పి మోర్గాన్, వంటి 342 కంపెనీలు ఈ ఏడాది యూనివర్సిటీలో క్యాంపస్ ప్లేసెమెంట్స్ డ్రైవ్ నిర్వహించారు. వీటి ద్వారా 6 వేల 3 వందలకు పైగా ప్లేసెమెంట్స్ ఆఫర్స్ పొందారని, 4 వేల 750 మంది విద్యార్థులు ప్లేసెమెంట్స్ సా ధించారని ఆయన వెల్లడించారు.




