calender_icon.png 28 October, 2025 | 6:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘జీడీజీ’తో ‘కేఎల్‌హెచ్’ భాగస్వామ్యం

28-10-2025 12:41:37 AM

హైదరాబాద్ సిటీ బ్యూరో, అక్టోబర్ 27 (విజయక్రాంతి): కేఎల్‌హెచ్ అజీజ్ నగర్, హైదరాబాద్ క్యాంపస్‌లో ఇటీవల గూగుల్ డెవలపర్ గ్రూప్స్ (జీడీజీ) సహకారంతో గూగుల్ క్లౌడ్‌తో ఏఐ నిర్మాణం అనే ప్రాక్టికల్ వర్క్‌షాప్‌ను విజయవంతంగా నిర్వహించింది. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజినీర్, గూగుల్ డెవలపర్ గ్రూప్ హైదరాబాద్ లీడ్ ఆర్షద్ దేవాని, జిడిజి క్లౌడ్ ఆర్గనైజర్ శివరామ్ శాస్త్రి జొన్నలగడ్డ ప్రత్యేక మద్దతు అందించారు.

విద్యార్థులు, అధ్యాపకులు చురుకైన పాల్గొనికతో ఈ వర్క్‌షా ప్‌లో భాగమై, ఏఐ ఆధారిత టెక్నాలజీలు, వాటి అన్వయాలను తెలుసుకునే అరుదైన వేదికగా నిలిచింది. కార్యక్రమంలో జిడిజికి చెందిన ప్రముఖ స్పీకర్ జయ్ ఠక్కర్ (టీమ్ లీడ్, ప్రోడక్ట్ మేనేజర్ ఏఐ) పాల్గొని ఎంసిపి ఇంటిగ్రేషన్‌ను ప్రదర్శించారు. ఏఐ డేటా ఇంటరాక్షన్ల కోసం సురక్షిత వీఎం ఆథెంటికేషన్ మాడ్యూల్‌ను రూపొందించారు.

ఈ భాగస్వామ్యం మా విద్యార్థుల్లో సృజనాత్మకత, ఆవిష్కరణ, సాంకేతిక ప్రతిభను పెం పొందిస్తుందని కేఎల్ డీమ్డ్‌టు బి యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట్ ఇంజి కొనేరూ లక్ష్మణ్ హవీష్ అన్నారు. ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో డా. ఎ. రామకృష్ణ (ప్రిన్సిపల్), డా. అర్పితా గుప్తా (హెచ్‌ఓడీ  సిఎస్‌ఇ), డా. ఎన్. రామారావు (కన్వీనర్  జిడిజి వర్క్‌షాప్) చేసిన కృషి కీలక పాత్ర పోషించింది.